వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » పంజాబ్ కింగ్స్ లెవన్ స్కోరు 203/3 (IPL 3 | Kings XI Punjab | Bangalore Royal Challengers)
Bookmark and Share Feedback Print
 
ఐపీఎల్-3లో భాగంగా మంగళవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. బ్యాటింగ్‌కు దిగిన బొపారా, బైస్లా ఇద్దరూ ఫోర్లు, సిక్సర్లతో రాయల్ ఛాలెంజర్స్‌ను బెంబేలెత్తించారు.

బొపారా 50 బంతుల్లో 77 పరుగులు చేస్తే, బైస్లా 51 బంతుల్లో 75 పరుగులు సాధించాడు. నిజానికి వీళ్లద్దరి గురించి ఇప్పటివరకూ క్రికెట్ అభిమానులకు అంతగా తెలియదు. నేటి అద్భుతమైన ఆటతీరుతో క్రికెట్ ప్రపంచం దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. ఇద్దరూ కలిసి ఏకంగా 129 పరుగుల భాగస్వామ్యాన్ని అందించటంతో జట్టు స్కోరు 203కి చేరుకున్నదని చెప్పవచ్చు.

ఇకపోతే ఆ తర్వాత యువరాజ్ సింగ్(9) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. ఆ తర్వాత జయవర్థనె(26), పఠాన్(3)లిద్దరూ నాటవుట్‌గా నిలిచి జట్టు స్కోరును 203కు చేర్చారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.