వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » టీమ్ ఇండియా నెం.1 టెస్టు జట్టులా ఆడట్లేడు..!: స్టీవ్ వా (Steve Waugh | Sri Lanka | India | Test Series | Australia | Bowling | Batting)
Bookmark and Share Feedback Print
 
FILE
శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత్ క్రికెట్ జట్టు ఆటతీరుపై ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ వా అసంతృప్తి వ్యక్తం చేశాడు. గాలె, కొలంబో టెస్టుల్లో టీమ్ ఇండియా ఆటతీరును చూస్తుంటే.. నిజానికి ప్రపంచ నెంబర్ వన్ టెస్టు జట్టులా భారత్ కనిపించడం లేదని స్టీవ్ వా అన్నాడు.

బౌలింగ్‌లో బలహీనంగా ఉన్న భారత జట్టు శ్రీలంకతో జరిగే టెస్టులో నానా కష్టాలు పడుతుందని స్టీవ్ వా వ్యాఖ్యానించాడు. ఇంకా బ్యాటింగ్‌లో బలంగా ఉన్న ధోనీసేన శ్రీలంకను ఎదుర్కొనేందుకు ఆపసోపాలు పడుతుందని చెప్పాడు. మొత్తానికి టెస్టు ర్యాంకింగ్స్‌లో ఉన్నత స్థానంలో ఉన్న భారత్, లంక పర్యటనలో తన స్థానాన్ని గుర్తించి ఆడట్లేదని స్టీవ్ వా వ్యాఖ్యానించాడు.

త్వరలో భారత్‌లో ఆస్ట్రేలియా జట్టు పర్యటన గురించి స్టీవ్ వా మాట్లాడుతూ.. ఇది ఎంతో పోటాపోటీగా సాగే సిరీస్‌లో విజయం ఎవరినైనా వరించవచ్చునని అన్నాడు. కానీ ప్రతిభావంతులైన అనేక మంది ఆటగాళ్ల రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆస్ట్రేలియా జట్టు గతంలో ఉన్నంత బలంగా లేదని స్టీవ్ వా అంగీకరించాడు. భారత జట్టును స్వదేశంలో ఓడించడం ఎప్పటికీ కష్టమే. అయితే ఈ జట్టును బౌలింగ్ సమస్యలు పట్టి పీడిస్తుందని స్టీవ్ వా గుర్తు చేశాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.