ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » కామన్వెల్త్ గేమ్స్‌కు భారీ విరాళమా.? నో ఛాన్స్..!: బీసీసీఐ (Indian Cricket Board | BCCI | CWG | Commonwealth Games | Alan Isaac | ICC)
కామన్వెల్త్ గేమ్స్‌కు భారీ విరాళమా.? నో ఛాన్స్..!: బీసీసీఐ
FILE
దేశ రాజధాని నగరం ఆతిథ్యమిస్తోన్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌కు రూ.100 కోట్ల భారీ విరాళాన్ని అందజేసే ప్రసక్తే లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తేల్చి చెప్పింది. బీసీసీఐ వద్ద కామన్వెల్త్ నిర్వాహక కమిటీ (సీడబ్ల్యూజీ) నిధుల సహాయం కోరడంపై బీసీసీఐ మండిపడింది.
ఈ మేరకు శనివారం దేశ వాణిజ్య నగరం ముంబైలో జరిగిన బీసీసీఐ కార్యవర్గ సమావేశంలో కామన్వెల్త్ గేమ్స్‌కు నిధుల సహాయం చేసేది లేదని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
అక్టోబర్ మూడో తేదీ నుంచి 14వ తేదీ వరకు జరుగనున్న కామన్వెల్త్ క్రీడా పోటీల నిర్వహణ, స్టేడియాల నిర్మాణం వంటి తదితర కార్యక్రమాల కోసం కుదుర్చుకున్న ఒప్పందాల్లో భారీ అవకతవకలు జరిగాయని కేంద్ర అవినీతి నిరోధక విభాగం తెలపింది. ఇంకా కామన్వెల్త్ అవకతవకలపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేయడంతోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అలాగే ఈ సమావేశంలో ఐసీసీ ఉపాధ్యక్ష రేసులో ఉన్న న్యూజిలాండ్ క్రికెట్ ఛైర్మన్ అలాన్ ఇసాక్‌కు మద్దతివ్వాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి తీర్మానించింది.