ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » శ్రీలంకలో ముక్కోణపు వన్డే సిరీస్: సచిన్‌కు విశ్రాంతి! (Sachin Tendulkar | Gautam Gambhir | Harbhajan Singh | New Zealand | Srilanka | Tri-series)
శ్రీలంకలో ముక్కోణపు వన్డే సిరీస్: సచిన్‌కు విశ్రాంతి!
FILE
శ్రీలంకలో జరుగనున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఆడే భారత జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఇందులో ఓపెనర్ గౌతం గంభీర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, స్టార్ బౌలర్ హర్భజన్ సింగ్‌లకు విశ్రాంతి ఇచ్చారు.
శ్రీలంక-భారత్-న్యూజిలాండ్‌ల మధ్య ఆగస్టు పదో తేదీ నుంచి ప్రారంభం కానున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఆడే భారత జట్టులో, సంప్రదాయ టెస్టు టీమ్‌లో స్థానం దక్కించుకున్న అభిమన్యు మిథున్‌కు సెలక్టర్లు అవకాశం కల్పించారు. అలాగే ఆసియా కప్‌లో రాణించిన తివారీ, అశ్విన్‌లు కూడా ఈ జట్టులో స్థానం సంపాదించుకున్నారు.
జట్టు వివరాలు: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, దినేష్ కార్తీక్, ఆర్ అశ్విన్, ప్రవీణ్ కుమార్, ఇషాంత్ శర్మ, అభిమన్యు మిథున్, ఆశిష్ నెహ్రా, ప్రజ్ఞాన్ ఓజా, సౌరవ్ తివారీ.