ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » పాక్ క్రికెటర్లను యార్డ్ పోలీసులు అరెస్టు చేయలేదు: పీసీబీ (Pakistan Cricket Board | Salman Butt | Mohammad Asif | Mohammad Aamir | Yawar Saeed | spot-fixing)
పాక్ క్రికెటర్లను యార్డ్ పోలీసులు అరెస్టు చేయలేదు: పీసీబీ
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల్లో చిక్కుకున్న పాకిస్థాన్ క్రికెటర్లను లండన్ పోలీసులు అరెస్టు చేసే ప్రసక్తే లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తెలిపింది. స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సల్మాన్ భట్, మొహమ్మద్ ఆసిఫ్, మొహమ్మద్ అమీర్‌ల వద్ద స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు రెండోసారిగా బుధవారం దర్యాప్తు జరిపారు.
ఈ దర్యాప్తుతో పాకిస్థాన్ క్రికెటర్లు అరెస్టయ్యే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే పాకిస్థాన్ క్రికెటర్లను అరెస్టు చేసే ప్రసక్తే లేదని పాక్ క్రికెట్ మేనేజర్ యావర్ సయ్యిద్ అన్నారు. స్పాట్ ఫిక్సింగ్‌కు ఒడిగట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు క్రికెటర్లను లండన్ రాయబార కార్యాలయంలోనే దర్యాప్తు జరిపినట్లు సయ్యద్ చెప్పారు.
బుధవారం కూడా పాక్ క్రికెటర్ల వద్ద పోలీసులు దర్యాప్తు జరిపారు. అయితే వారిపై తగిన ఆధారాలు లేకపోవడంతో యార్డ్ పోలీసులు ప్రస్తుతానికి వారిని అరెస్టు చేయలేదని వెల్లడించారు. ఇంకా పాక్ క్రికెటర్ల తరపున విచారణ జరిపేందుకు న్యాయవాదిని కూడా నియమించినట్లు మేనేజర్ తెలిపారు.