వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » ట్విట్టర్ వ్యవహారం: వివాదంలో చిక్కుకున్న పీటర్సన్! (Kevin Pietersen | ODI | Twenty20 squads | Pakistan | World Cup T20 | Twitter)
Bookmark and Share Feedback Print
 
FILE
ఇంగ్లాండ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కెవిన్ పీటర్సన్ వివాదాల్లో చిక్కుకున్నాడు. ట్విట్టర్‌లో ఘాటు పదాన్ని ఉపయోగించినందుకుగాను పీటర్సన్‌పై క్రికెట్ బోర్డు కన్నెర్ర చేసింది. ఇప్పటికే పాకిస్థాన్‌తో జరిగే వన్డే, ట్వంటీ-20 మ్యాచ్‌లో ఆడే జట్టులో కెవిన్ పీటర్సన్‌ను సెలక్టర్లు పక్కనబెట్టారు.

జట్టు నుంచి తనను తొలగించడంపై ట్విట్టర్ పేజీలో రాసుకున్న పీటర్సన్ వివాదంలో చిక్కుకుపోయాడు. ఇందులో ఈ సీజన్ ముగిసింది. ప్రపంచ కప్ ట్వంటీ-20 హీరో ట్వంటీ-20 జట్టును నుంచి తొలగించబడ్డాడు. అంటూ రాసి ఆ తర్వాత ఓ ఘాటు పదాన్ని కెవిన్ పీటర్సన్ వాడాడు. అలాగే ట్విట్టర్ రిజిస్టర్ తొలగించేందుకు ముందే పలు పాఠకులు, స్నేహితులకు పంపాడు. ఈ విషయం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అధికారుల దృష్టికి వెళ్లింది.

ఈ విషయమై ఇంగ్లాండ్ జట్టు సెలక్టర్ మిల్లర్ మాట్లాడుతూ.. ట్విట్టర్‌లో ఇలాంటి పదజాలం ఉపయోగించడం సరికాదు. ఇంగ్లాండ్ జట్టు మంచికోసం సహ సెలక్టర్లతో కలిసి జట్టును ఎంపిక చేయడం జరిగింది. ఇందులో ఒక సభ్యునికి మాత్రం ముఖ్యత్వం ఇవ్వలేదు. ఇంగ్లాండ్ జట్టును పటిష్టం చేసే దిశగా టీమ్‌ను ఎంపిక చేశామన్నారు. ఇంకా బ్రిటీష్ క్రికెటర్లు ట్విట్టర్‌లాంటి సామాజిక నెట్‌వర్క్ సైట్లను ఉపయోగించడంపై నిషేధం విధించాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు భావిస్తోంది.

కాగా., కెవిన్ పీటర్సన్ ప్రస్తుతం ఆడుతున్న దేశవాళీ కౌంటీ జట్టు సర్రేకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఫామ్‌ కోల్పోయిన పీటర్సన్‌ను గాడిలో పడేట్లు చేయాలని సర్రే క్రికెట్ సంఘం వద్ద ఇంగ్లాండ్ సెలక్టర్లు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టు నుంచి తాను తొలగించబడటంతో పాటు సర్రే జట్టుకు ఎంపికైన విషయాన్ని కెవిన్ పీటర్సన్ అవహేళన చేస్తూ ట్విట్టర్‌లో పొందుపరిచాడు. ఈ వ్యవహారం వివాదాస్పదమైంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.