వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » 'ఫిక్సింగ్'పై ఐసీసీ నిరోధక విభాగం ఏం చేస్తోంది..?: వాట్సన్ (Shane Watson | spot-fixing | ICC anti-corruption unit | England | Australian all-rounder)
Bookmark and Share Feedback Print
 
FILE
యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న "స్పాట్ ఫిక్సింగ్" వ్యవహారంపై అంతర్జాతీయ క్రికెట్ బోర్డు (ఐసీసీ) అవినీతి నిరోధక విభాగం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆస్ట్రేలియన్ ఆల్-రౌండర్ షేన్ వాట్సన్ ఆరోపించాడు. 'స్పాట్ ఫిక్సింగ్' వ్యవహారంపై ఐసీసీ నిరోధక విభాగం అసలు ఎలాంటి పని చేయడం లేదని వాట్సన్ అన్నాడు.

గత ఏడాది యాషెస్ సిరీస్ సందర్భంగా ముంబైకి చెందిన ఓ బుకీ తమను కలిశాడంటూ ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని షేన్ వాట్సన్ గుర్తు చేశాడు. దీనిని బట్టి అసలు ఐసీసీ అవినీతి నిరోధక విభాగం పనిచేస్తున్నట్లు అనిపించట్లేదని వాట్సన్ చెప్పాడు.

క్రికెట్‌పై అభిమానుల నమ్మకాన్ని వమ్ము చేసే ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేసే దిశగా అవినీతి నిరోధక విభాగం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని షేన్ వాట్సన్ అన్నాడు. ఇంకా మ్యాచ్ ఫిక్సింగ్ అంశంపై ఐసీసీ లోతుగా విచారణ జరపాలని షేన్ వాట్సన్ కోరాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.