వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » ఆసిఫ్ మాజీ ప్రియురాలు మాలిక్ వద్ద ఐసీసీ విచారణ!? (Mohammad Asif | Pakistan | England | Veena Malik | Spot-fixing | Reza Hasan | Sydney Test)
Bookmark and Share Feedback Print
 
PTI
"స్పాట్ ఫిక్సింగ్" వ్యవహారంలో చిక్కుకున్న పాకిస్థాన్ క్రికెటర్ మొహమ్మద్ ఆసిఫ్‌కు మ్యాచ్ ఫిక్సర్లతో సంబంధమున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేసిన ఆసిఫ్ మాజీ ప్రియురాలు, నటీమణి వీనా మాలిక్‌ వద్ద అంతర్జాతీయ క్రికెట్ బోర్డు (ఐసీసీ) దర్యాప్తు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి.

మొహ్మద్ ఆసిఫ్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడే వాడని తెలిపిన వీనా మాలిక్ వద్ద ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఐసీసీ ఉన్నతాధికారిక బృందం విచారణ జరిపినట్లు తెలుస్తోంది. తన వద్ద నుంచి భారీగా నగదు గుంజేశాడంటూ గతంలో మీడియా ముందుకు వచ్చిన ఆసిఫ్ స్నేహితురాలు, మాజీ ప్రియురాలు వీణా మాలిక్‌ వద్ద విచారణ జరిపేందుకు ఐసీసీ అధికారి హసన్ పాకిస్థాన్‌కు వచ్చినట్లు సమాచారం.

మొహమ్మద్ ఆసిఫ్‌కు భారత్‌కు చెందిన ఓ మ్యాచ్ ఫిక్సర్‌కు సంబంధమున్నట్లు ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీనా మాలిక్ తెలియజేసింది. గతంలో పాకిస్థాన్-ఆస్ట్రేలియాలకు మధ్య జరిగిన సిడ్నీ టెస్టు చివరి టెస్టు కూడా మ్యాచ్‌ బుకీల ప్రమేయంతో ఫిక్సింగ్ అయ్యిందంటూ వీనా మాలిక్ వెల్లడించింది.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు ఐసీసీ ఉన్నతాధికారి రేజా హసన్ వచ్చారని, వీనా మాలిక్ వద్ద విచారణ పూర్తయిన తర్వాత పాకిస్థాన్‌కు చెందిన ఫెడరల్ ఇన్వస్టిగేషన్ ఏజెన్సీ అధికారులతో సమావేశమవుతారని వార్తలు వస్తున్నాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.