వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » ఆటగాళ్లపై కన్నేసి ఉంచేందుకు ఐసీసీ పోలీస్ స్టేషన్ కాదు! (Saurav Ganguly | ICC | Police station | Tendulkar | Anil Kumble | Rahul Dravid)
Bookmark and Share Feedback Print
 
FILE
"స్పాట్‌ఫిక్సింగ్" లాంటి వ్యవహారాలను వెంటనే పసిగట్టేందుకు, ప్రతీ క్రికెటర్‌పై కన్నేసి ఉంచేందుకు అంతర్జాతీయ క్రికెట్ బోర్డు (ఐసీసీ) పోలీస్ స్టేషన్ కాదని టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీ అన్నాడు. ప్రస్తుతం బుకీలు తమను సంప్రదించారంటున్న ఆటగాళ్లే బుకీల పట్ల అప్రమత్తంగా ఉండాలని దాదా సూచించాడు.

ఐసీసీకి నియమ నిబంధనలంటూ ఉంటాయని, ఒక అంశంపై ఐసీసీ విచారణ జరిపితే బలమైన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని సౌరవ్ తెలిపాడు. ఇంకా స్పాట్‌ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు రుజువైతే పాక్ క్రికెటర్లపై తగిన చర్యలు తీసుకోవాలని గంగూలీ అన్నాడు.

తాను కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన కాలంలో తనను ఏ బుకీ సంప్రదించలేదని సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. అలాగే సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లేలు భారత జట్టుకు కెప్టెన్సీ సారథ్యం వహించిన సమయంలోనూ బుకీలు తమను సంప్రదించలేదని గంగూలీ వెల్లడించాడు. బుకీలు సంప్రదించేవిధమైన వాతావరణం తమ హయాంలో లేదన్నాడు.

సచిన్, ద్రావిడ్, కుంబ్లేలతో పాటు తన హయాంలో ఏ ఒక్క బుకీకి తమను సంప్రదించే ధైర్యం లేదని కెప్టెన్ తెలిపాడు. సాధారణంగా ఒక క్రికెటర్‌ను సంప్రదించే బుకీ, ఆతని పూర్తి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునే సంప్రదింపులు జరుపుతాడని తాను అభిప్రాయపడుతున్నట్లు గంగూలీ వెల్లడించాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.