వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » భారత ఆటగాళ్లను బుకీలు సంప్రదించలేదు: మాస్టర్ సచిన్ (Sachin Tendulkar | ICC | spot-fixing | England | Pakistan | Salman Butt)
Bookmark and Share Feedback Print
 
PTI
"స్పాట్‌ ఫిక్సింగ్"పై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తొలిసారి నోరు విప్పాడు. తన 21 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో భారత ఆటగాళ్లను బుకీలు సంప్రదించినట్లు ఎలాంటి దాఖలాలు లేవని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. అలాగే భారతీయ క్రికెటర్లను బుకీలు కలిశారనే వార్తలు ఇంతవరకు తాను వినలేదని మాస్టర్ చెప్పాడు.

ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టెస్టులో పాకిస్థాన్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) దర్యాప్తు చేయించి, దోషులైన ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని సచిన్ టెండూల్కర్ కోరాడు.

ఇంకా ఐసీసీ దర్యాప్తులో క్రీడాకారులు దోషులని తేలితే ఐసీసీ కఠినమైన చర్యలు తీసుకోవాలని సచిన్ టెండూల్కర్ శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నాడు. ఫిక్సింగ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలు నిజమైతే అది ఆటకు చెడుపేరు తెచ్చేదేనని సచిన్ చెప్పాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.