వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » ఇమ్రాన్ ఖాన్‌లో మాత్రమే ఆ సత్తా ఉంది: కపిల్ దేవ్ (Imran Khan | Kapil Dev | Spot Fixing | Cricket | England Test)
Bookmark and Share Feedback Print
 
FILE
స్పాట్ ఫిక్సింగ్ వివాదంతో ప్రపంచ క్రికెట్ అభిమానుల నోళ్లలో నానుతున్న పాకిస్థాన్ క్రికెట్‌ను సరైన మార్గంలో నడిపించే సామర్థ్యం పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్‌ ఖాన్‌కు మాత్రమే ఉందని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌ అన్నాడు. ఇప్పటికే భద్రతాపరమైన సమస్యలతో సతమతమవుతున్న పాకిస్థాన్ క్రికెట్‌కు ఈ సమయంలో మద్దతు అవసరమన్నాడు.

స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ క్రికెట్‌ను సంక్షోభం బారిన పడకుండా చూడాలని భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)ని కోరాడు.

కపిల్ శుక్రవారం జియో సూపర్ చానెల్‌తో మాట్లాడుతూ... అంతర్జాతీయ క్రికెట్‌లో ముఖ్య పాత్ర పోషిస్తున్న పాకిస్తాన్ క్రికెట్, ఈ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంతో వినాశన దిశగా మళ్లకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఐసీసీపైనే ఉందని కపిల్ అభిప్రాయపడ్డాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.