వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » స్పాట్ ఫిక్సింగ్ పాపమంతా భారత బుకీలదే!: వాసన్ (Spot Fixing | India | Bookies | Pakistan | ICC | Wajid Hasan | Cricket)
Bookmark and Share Feedback Print
 
స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో పాకిస్థాన్ క్రికెటర్లు అమాయకులని, అసలు దోషి బుకీ మజహర్ మజీదేనని బ్రిటన్‌లోని పాక్ హై కమిషనర్ వాజిద్ హసన్ అన్నారు. తమ క్రికెటర్లపై నిరవధిక నిషేధం విధించడం వెనుక ఐసీసీ అధ్యక్షుడు శరద్ పవార్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ లోర్గాత్‌ల కుట్ర ఉందని వాజిద్ ఆరోపించారు. నిరాధార ఆరోపణల ద్వారా తీసుకున్న ఈ చర్యతో ఐసీసీ తమ క్రికెటర్లను బలిపశువును చేసిందని వాజిద్ హసన్ విమర్శించారు.

ఇంకా స్పాట్ ఫిక్సింగ్ వివాదమంతా భారత బుకీలదేనని వాజిద్ ధ్వజమెత్తారు, ఫిక్సింగ్ కుంభకోణంలో ఆసియా బుకీలదే కీలక పాత్ర అని ది న్యూస్ ఆఫ్ ది వరల్డ్ వెల్లడించిందని వాజిద్ స్పష్టం చేశారు. ఒకవేళ పాక్ బుకీలుంటే ఆ టాబ్లాయిడ్ స్పష్టం చేసేదని వాజిద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీని అర్థం భారత్ బుకీలనడమే కాక మరేమిటని వాజిద్ విశ్లేషిస్తున్నారు.

ఫిక్సింగ్ వెనక నిజానిజాలు నిగ్గు తేల్చకుండానే ఐసీసీ చర్యలు తీసుకోవడం మూర్ఖంగా ఉందని వాజిద్ దుమ్మెత్తిపోశారు. ఇంగ్లాండ్ ‌తో మిగతా సిరీస్‌ల నుంచి సల్మాన్ భట్, ఆసిఫ్, అమీర్‌లు స్వచ్ఛంధంగా తప్పుకున్నట్టు ఐసీసీకి ముందే స్పష్టం చేశాం.

ఇంతలోనే హుటాహుటిన ఓ ఐదు పేజీల నోటీసు తయారు చేసి ఆటగాళ్లకు అందజేయడమేమిటని వాజిద్ ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే.. ఈ మొత్తం వ్యవహారం వెనక ఏదో కుట్ర ఉందని అర్థమవుతోందని వాజిద్ విమర్శించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.