వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » ఐసీసీ అవార్డుల జాబితా నుంచి ఆసిఫ్, అమీర్‌లు అవుట్! (ICC awards | Mohammad Asif | Mohammad Amir | Salman Butt | Pakistan | England)
Bookmark and Share Feedback Print
 
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్లు మొహమ్మద్ ఆసిఫ్, మొహమ్మద్ అమీర్‌ పేర్లను అంతర్జాతీయ క్రికెట్ బోర్డు (ఐసీసీ) అవార్డుల జాబితా నుంచి ఉపసంహరించడమైంది. ఐసీసీ అవార్డుల జాబితా నుంచి అమీర్, ఆసిఫ్ పేర్లను తొలగిస్తున్నట్లు ఐసీసీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

2010 ఏడాదికి (ఆగస్టు 24, 2009 నుంచి ఆగస్టు 10, 2010 వరకు) గాను ఆమెర్ 'ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు మొహమ్మద్ అమీర్ నామినేట్ అయ్యాడు. ఈ నిర్ణీత కాలంలో ఆమెర్ తొమ్మిది టెస్టుల్లో 31.45 సగటుతో 33 వికెట్లు తీసుకున్నాడు. కానీ స్పాట్ ఫిక్సింగ్‌ వ్యవహారంతో ఆతని పేరును ఐసీసీ అవార్డుల జాబితా నుంచి తొలగించింది.

ఇకపోతే.. మొహమ్మద్ అమీ‌ర్‌ను స్కాట్లాండ్‌ యార్డ్ పోలీసులు శుక్రవారం మరోసారి ప్రశ్నించారు. నలుపు టీ షర్టు, జీన్స్ ధరించి మెర్సిడెస్ బెంజ్‌లో దిగిన అమీర్‌ను పోలీసులు హాయ్ అంటూ విష్ చేయడం విశేషం. ఈ క్రమంలో ఆమెర్ ఏమాత్రం ఒత్తిడి లేకుండా అసలేమీ జరగనట్లు ఎంతో ఉల్లాసంగా కనిపించాడు.

ఇదిలా ఉంటే ఐసీసీ నుంచి సస్పెన్షన్‌కు గురైన సల్మాన్ భట్, ఆసిఫ్, అమీర్ స్థానాల్లో ఇంగ్లండ్‌తో జరగనున్న టి-20, వన్డే కోసం పాక్ సెలెక్షన్ కమిటీ ఇద్దరు యువ క్రికెటర్లను ఎంపికచేసింది. బ్యాట్స్‌మన్ అసద్ షఫీఖ్, లెఫ్ట్ ఆర్మ్‌పేసర్ మహ్మద్ ఇర్ఫాన్‌లకు పాక్ సెలక్టర్లు అవకాశం కల్పించారు.

ఇకపోతే.. పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ భట్ నుంచి స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు స్వాధీన పరుచుకున్న సొమ్ము రూ. 36 లక్షలు కాదట..! అది ఏకంగా రూ. 1.08 కోట్లని 'డెయిలీ మెయిల్' పేర్కొంది. పైగా 'ది న్యూస్ ఆఫ్ ది వరల్డ్' నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో రిపోర్టర్లు, బుకీ మజీద్‌కు అందజేసిన నోట్ల కట్టలు కూడా ఇందులో ఉన్నాయని ఆ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అంటే దీనర్థం మజీద్ నుంచి ఆ సొమ్మును సల్మాన్ భట్ తీసుకున్నట్లేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.