ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » పాక్ క్రికెటర్లను విడిచిపెట్టిన పోలీసులు: పాక్ లాయర్ (Mohammad Asif | Mohammad Aamer | Salman Butt | Pakistan cricket team | Spot Fixing)
'స్పాట్ ఫిక్సింగ్' ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ క్రికెటర్ల వద్ద విచారణ జరిపిన లండన్ పోలీసులు వారిని విడిచిపెట్టారు. శుక్రవారం పాక్ కెప్టెన్ సల్మాన్ భట్, మొహమ్మద్ అమీర్, మొహమ్మద్ ఆసిఫ్‌లపై విచారణ జరిపిన పోలీసులు వారిపై ఎలాంటి నేరాలు లేకపోవడంతో అరెస్టు చేయకుండా విడుదల చేసినట్లు పాక్ క్రికెటర్ల తరపు న్యాయవాది ఎలిజిబత్ రాబర్ట్‌సన్ తెలిపారు.
లండన్‌లోని కిల్బర్న్ పోలీస్ స్టేషన్‌లో సల్మాన్ భట్, ఆసిఫ్, అమీర్‌లను పోలీసులు విచారణ జరిపారు. విడివిడిగా ఈ ముగ్గురి వద్ద పోలీసులు విచారణ జరిపినట్లు న్యాయవాది వెల్లడించారు.
విచారణలో పాక్ క్రికెటర్లు తాము ఎలాంటి తప్పు చేయలేదని చెప్పడంతో పాటు విచారణకు అన్ని సహకరిస్తామని తెలిపినట్లు రాబర్ట్‌సన్ విలేకరులతో చెప్పారు. ఇంకా వారిపై ఎలాంటి నేరాలు లేకపోవడంతో అరెస్టు చేయకుండా పోలీసులు విడిపించినట్లు లాయర్ అన్నారు.