ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నాలుగో సీజన్‌లో జరుగనున్న మ్యాచ్‌ల సంఖ్య మరియు క్రికెట్ పోటీల షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు ఐపీఎల్ కార్యవర్గ సమావేశం కానుంది. ఆదివారం (సెప్టెంబర్-5) ఏర్పాటయ్యే ఐపీఎల్ కార్యవర్గ సమావేశం ఐపీఎల్ నాలుగో సీజన్‌లో ఆడే జట్ల సంఖ్యను, మ్యాచ్‌లను కుదించే అంశంపై చర్చలు జరుపనున్నట్లు తెలిపింది.
ఇప్పటికే ఐపీఎల్ జట్ల సంఖ్య పదికి చేరుకోవడంతో మ్యాచ్‌ల సంఖ్యను తగ్గించే దిశగా ఐపీఎల్ కార్యవర్గ సమావేశం నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఇంకా ముంబైలో జరిగే ఈ సమావేశంలో ఆటగాళ్ల ఒప్పందాలను పరిశీలించడం, వారి కాంట్రాక్టులను ఖరారు చేయడం వంటి ఇతరత్రా అంశాలపై చర్చలు జరుపనుందని ఐపీఎల్ అధికారిక వర్గాల సమాచారం.
కాగా కాసుల పంట పండించే ఐపీఎల్‌లో భారీ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ సస్పెన్షన్‌కు తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీ కావడం.. ఇదే తొలిసారి కావడం గమనార్హం.