వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » సొమ్ము మజీద్ ఇచ్చాడే కానీ.. అది కాంట్రాక్టు డబ్బు! (Pakistan | Match Fixing | Cricket | London | Cricketers | ICC)
Bookmark and Share Feedback Print
 
స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో అభియోగాలు ఎదుర్కొంటున్న ముగ్గురు పాకిస్థాన్ క్రికెటర్లు బుకీ నుంచి కొంత సొమ్ము స్వీకరించినట్టు అంగీకరించారు. అయితే, ఈ సొమ్ము తమ వాణిజ్య కాంట్రాక్టర్లకు సంబంధించనదని వారు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన కొన్ని పత్రాలను కూడా వారు చూపించారు. దీంతో లండన్ పోలీసులు వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదు.

ముగ్గురు పాక్ క్రికెటర్లను అదుపులోకి తీసుకున్న స్కాట్లండ్‌యార్డ్‌ పోలీసులు శనివారం విచారణ జరిపినట్టు జట్టు న్యాయ సలహాదారు వెల్లడించారు. అయితే, తమ హోటల్‌ గదుల్లో లభించిన సొమ్ము మజీద్‌ ఇచ్చినదేనని వారు అంగీకరించినట్లు జీఈఓ టెలివిజన్‌ ఛానల్‌ తెలియజేసింది. వివిధ వాణిజ్య సంస్థలతో తాము కుదుర్చుకున్న స్పాన్సర్‌షిప్‌ కాంట్రాక్టు కింద ఆ సొమ్మును మజీద్‌ తమకు చెల్లించినట్టు తెలిపారు.

స్పాన్సర్‌షిప్‌ ఒప్పందాలు కుదుర్చుకోవడంలో మజీద్‌ తమకు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడని కూడా వారు తెలిపినట్లు ఆ ఛానల్‌ తెలియజేసింది. పోలీసులకు తమ క్రికెటర్లు ఈ వివరాలు చెప్పినట్లు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు న్యాయ సలహాదారు తఫజుల్‌ రిజ్వీ ధృవీకరించారు.

స్పాట్‌ఫిక్సింగ్‌లో భాగంగా నోబాల్స్‌ వేసేందుకు తమకు ఈ సొమ్ము లభించలేదని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమ స్పాన్సరింగ్‌ ఒప్పంద పత్రాలను పోలీసులకు చూపించారు. దీంతో వారిపై ఎలాంటి ఆరోపణలు నమోదు చేయకుండా స్కాట్లండ్‌ పోలీసులు వదిలిపెట్టారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.