ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » జీవితకాల నిషేధమే ఫిక్సింగ్ అడ్డుకట్టకు మార్గం: వెట్టోరి (Match-fixing | Vettori | Life bans | Halt corruption | Cricket)
అవినీతికి పాల్పడే క్రికెటర్లపై జీవితకాల నిషేధం విధిస్తేనే మ్యాచ్ ఫిక్సింగ్‌కు అడ్డుకట్ట వేయగలుగుతామని న్యూజిలాండ్ కెప్టెన్ డేనియల్ వెట్టోరి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం స్పాట్ ఫిక్సింగ్‌లో పాకిస్థాన్ క్రికెటర్లు చిక్కుకున్న వ్యవహారం క్రికెట్ ప్రపంచాన్ని ఓ కుదుపుకుదుపుతున్న విషయం తెల్సిందే.
దీనిపై వెట్టోరి స్పందిస్తూ మ్యాచ్ ఫిక్సింగ్‌కు ఏ ఒక్క క్రికెటర్ పాల్పడినట్టు రుజువైనా లేక మ్యాచ్‌కు సంబంధించి చట్ట వ్యతిరేకంగా నడుచుకున్నట్టు రుజువైతే జీవితకాల నిషేధం విధించాలని డిమాండ్ చేశాడు. పాక్ క్రికటెర్లపై తొలిసారి ఈ తరహా ఆరోపణలు వచ్చిన తర్వాత వెట్టోరి తొలిసారి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
గత వేసవిలో డునెడిన్‌లో పాక్‌తో జరిగిన టెస్టులో బ్లాక్ క్యాప్స్ 32 పరుగుల తేడాతో విజయం సాధించారని, ఈ మ్యాచ్‌లో ఎలాంటి అవకతవకలు జరుగలేదనే విశ్వాసం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం వస్తున్న అన్నిరకాల ఆరోపణలు రుజువైతే అంతకంటే విషాదకర సంఘటన మరొకటి లేదన్నారు.