వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » లండన్‌లో అత్యవసరంగా భేటీ అయిన పీసీబీ అధికారులు! (Karachi, PCB officials, Pakistan, UK, British Tabloid, ICC probe spot-fixing)
Bookmark and Share Feedback Print
 
స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో మరో క్రికెటర్ పాత్ర ఉన్నట్టు బ్రిటీష్ టాబ్లాయిడ్ మరో కథనాన్ని ప్రచురించడంతో పాకిస్థాన్ క్రికెట్ అధికారులు ఆదివారం అత్యవసరంగా లండన్‌లో భేటీ అయ్యారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారులతో పాటు బ్రిటన్‌కు వెళ్లిన ప్రత్యేక బృందం, జట్టు మేనేజ్‌మెంట్ సభ్యులు ఇందులో పాల్గొన్నారు.

దీనిపై పీసీబీ ఛైర్మన్ ఇజాజ్ భట్ మాట్లాడుతూ పీసీబీ అధ్వర్యంలో ఈ అత్యవసర భేటీ జరిగిందని, ఇందులో బ్రిటన్‌లోని పాక్ హైకమిషనర్ వాజీద్ శ్యామ్యూల్ కూడా పాల్గొన్నారని చెప్పారు. టాబ్లాయిడ్ ప్రచురించిన కథనంపై ఇందులో చర్చించినట్టు ఆయన సూచన ప్రాయంగా వెల్లడించారు.

తాజాగ పరిస్థితులపై పాక్ మాజీ కెప్టెన్ అమీర్ సొహైల్ స్పందిస్తూ.. పాకిస్థాన్ క్రికెట్ తీవ్ర గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటోందన్నారు. ఉత్పన్నమైన సమస్యను చక్కదిద్దడంలో బోర్డు విఫలమైందని, ఫలితంగా దేశ క్రికెట్ తీవ్ర సంక్షోభంలో కూరుకుని ఉందన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.