వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ! (Spot-fixing scandal | ICC | Independent commissioner | New York)
Bookmark and Share Feedback Print
 
క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై దర్యాప్తు జరిపేందుకు ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి భావిస్తోంది. ఈ కమిటీ ఎదుట ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వెల్లడించుకోవచ్చని తెలిపింది.

దీనిపై ఐసీసీ అధ్యక్షుడు శరద్ పవార్ స్పందిస్తూ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపేందుకు, లోతుపాతులు తెలుసుకునేందుకు, దీనికి పాల్పడిన క్రికెట్ ఆటగాళ్లపై తీసుకునే చర్యను సిఫార్సు చేసేందుకు ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు.

ప్రస్తుతానికి తాము ఏ ఒక్కరినీ శిక్షించలేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. స్పస్పెండ్‌కు గురైన ముగ్గురు పాక్ క్రికెటర్లు తమ వాదనలను ఇండిపెండెంట్ యాంటీ కరప్షన్ ట్రిబ్యునల్‌ ముందు వాదించవచ్చని ఆయన తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.