వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » ఆ ముగ్గురిని డ్రెస్సింగ్ రూంలోకి కూడా రానివ్వను: అఫ్రిది (Spot Fixing | Cricket | Dressing Room | Shahid Afridi | Pakistan)
Bookmark and Share Feedback Print
 
యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ క్రికెటర్లు సల్మాన్ భట్, అమీర్, ఆసిఫ్‌లను డ్రెస్సింగ్ రూమ్‌లోకి కూడా రానివ్వనని ఆ జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిది అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌చే సస్పెన్షన్‌కు గురైన తన సహచర క్రికెటర్లైన సల్మాన్‌ భట్‌, అమీర్‌, ఆసిఫ్‌‌లను పాక్‌ వన్డే జట్టు డ్రెస్సింగ్‌ రూం నుండి కూడా దూరంగా ఉంచుతామని అఫ్రిది తెలిపాడు.

పాక్‌ జట్టులోని దాదాపు అందరు ఆటగాళ్లకు మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో ప్రమేయముందని జట్టు ఓపెనర్‌ యాసిర్‌ హామీద్‌ పేర్కొన్నట్లు స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణాన్ని బట్టబయలు చేసిన టాబ్లాయిడ్‌ న్యూజ్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ వెల్లడించడం ద్వారా షాహిద్ అఫ్రిది స్పందిస్తూ.. వారిని డ్రెస్సింగ్ రూమ్‌లోకి కూడా రానివ్వనని చెప్పాడు.

పాకిస్థాన్ జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయానికొచ్చినట్లు అఫ్రిది వెల్లడించాడు. స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పటికీ, పాక్ జట్టు ఇంగ్లాండ్ పర్యటన ఎలాంటి విఘాతం కలుగకుండా కొనసాగాలని అఫ్రిది ఆశించాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.