ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » నా దగ్గరికి బుకీలెవరైనా వస్తే చెంప ఛెళ్లుమనిపిస్తా..!: భజ్జీ (Bajji | Spot Fixing | India | Pakistan | Cricket)
నా దగ్గరికి బుకీలెవరైనా వస్తే చెంప ఛెళ్లుమనిపిస్తా..!: భజ్జీ
FILE
తనను ఏ బుకీ అయినా సంప్రదిస్తే చెంప ఛెళ్లుమనిపిస్తానని భారత స్టార్ బౌలర్ హర్భజన్ సింగ్ అన్నాడు. స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిస్తున్న నేపథ్యంలో, బుకీలెవరైనా తనను సంప్రదిస్తే అంతే సంగతులని భజ్జీ స్పష్టం చేశాడు. మైదానంలో మాత్రమే గాకుండా వ్యక్తిగతంగా దూకుడుగా వ్యవహరించే భజ్జీ, బుకీలు తనను సంప్రదిస్తే మాత్రం వదిలిపెట్టనని అంటున్నాడు.
ఇంకా ఫిక్సింగ్ కోసం తననెవరైనా సంప్రదిస్తే వారికి తగిన సత్కారం తప్పందంటున్నాడు. ఇంకా తన కెరీర్‌లో ఇప్పటివరకు బుకీలెవరూ సంప్రదించలేదని హర్భజన్ చెప్పుకొచ్చాడు. పాక్ క్రికెటర్లపై 'స్పాట్ ఫిక్సింగ్' ఆరోపణలు గనక రుజువైతే వారికి అంతకంటే సిగ్గుమాలిన పని మరొకటి ఉండదని భజ్జీ విశ్లేషించాడు. స్పాట్ ఫిక్సర్లను సంప్రదించే రీతిలో క్రికటెర్ల వ్యక్తిగతం ఉండకూడదని భజ్జీ సూచించాడు.