ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » పాక్‌తో తొలి ట్వంటీ-20: 5వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ గెలుపు! (England | Pakistan | Cardiff | Shahid Afridi | Umar Gul | GP Swann)
పాక్‌తో తొలి ట్వంటీ-20: 5వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ గెలుపు!
FILE
ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టెస్టులో "స్పాట్ ఫిక్సింగ్" కుంభకోణం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, ఇంగ్లాండ్-పాకిస్థాన్‌ల మధ్య తొలి ట్వంటీ-20 మ్యాచ్ ఆదివారం జరిగింది. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టి-20 మ్యాచ్‌లో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు కేవలం 126 పరుగులే చేయగలిగింది.
ఇంగ్లాండ్ బౌల్ల ధాటికి పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్లు ధీటుగా రాణించలేకపోయారు. పాక్ జట్టులో జట్టులో ఉమర్ అక్మల్ మాత్రమే అత్యధికంగా 35 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్వాన్ 2 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 5 వికెట్లు కోల్పోయి కేవలం 17.1 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో డేవిస్ (33), ఇయాన్ మోర్గాన్ (38 నాటౌట్), మైకేల్ యార్డీ (35 నాటౌట్)లు రాణించారు. 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో యార్డీ, మోర్గాన్‌లు అభేద్యమైన ఆరో వికెట్‌కు 67 పరుగులు జోడించారు. ఫలితంగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి ట్వంటీ-20లో ఇంగ్లాండ్ జయభేరి మోగించింది.
పాకిస్థాన్ బౌలర్లలో అక్తర్, అఫ్రిదిలు చెరో రెండేసి వికెట్లు పడగొట్టగా, ఉమర్ గుల్ మాత్రం ఒక వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన మైకేల్ యార్డీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.