వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » ఐపీఎల్ నాలుగో సీజన్‌లో మొత్తం 74 ట్వంటీ-20 మ్యాచ్‌లు! (IPL, Twenty20 | BCCI | Cricket | Srinivasan | 74 Matches)
Bookmark and Share Feedback Print
 
FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నాలుగో సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి. 2011 నుంచి వచ్చే మూడేళ్ల వరకు ప్రతి ఐపీఎల్ సీజన్‌లో 74 మ్యాచ్‌లే జరుగుతాయని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తీర్మానించింది.

ఈ ఏడాది ఐపీఎల్‌లో 60 మ్యాచ్‌లు మాత్రమే జరిగిన నేపథ్యంలో, నాలుగో సీజన్‌కు సహారా పూణే వారియర్స్, కొచ్చి ఫ్రాంచైజీలు చేరడంతో మ్యాచ్‌ల సంఖ్య పెంచాల్సి వచ్చింది. ఈ రెండు ఫ్రాంఛైజాలతో కలిసి మొత్తం ఐపీఎల్‌ జట్ల సంఖ్య పదికి పెరిగింది. నిర్ణీత 74లో 70 మ్యాచ్‌లు లీగ్‌ దశలో, మిగిలిన నాలుగు ప్లేఆఫ్‌లో జరుగుతాయి.

మొత్తం పది జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించడం జరిగింది. ప్రతి జట్టు లీగ్‌ దశలో 14 మ్యాచులు ఆడాల్సి ఉండగా, ఏడు మ్యాచులు వారి సొంత మైదానాల్లో, మిగిలినవి ఇతర ప్రదేశాల్లో జరుగుతాయని బీసీసీఐ కార్యదర్శి ఎన్‌.శ్రీనివాసన్‌ తెలిపారు.

నాలుగో విడత ఐపీఎల్‌లో ఆయా ఫ్రాంఛైజీలు ఆటగాళ్లతో కుదుర్చుకునే ఒప్పందాలు మరో రెండేళ్లపాటు కొనసాగుతాయని శ్రీనివాసన్ చెప్పారు. ఇంకా ఆటగాళ్ల వేలం ఈ ఏడాది నవంబరులో జరిగే అవకాశముందన్నారు.

ఇకపోతే ఈసారి వేలంలో ముందు నుంచి ఉన్న ఎనిమిది ఫ్రాంచైజీలు తొమ్మిది మిలియన్ల అమెరికన్ డాలర్ల వరకు వెచ్చించుకోవడానికి ఐపీఎల్ గవర్వింగ్ కౌన్సిల్ అనుమతినిచ్చింది.

తమ జట్టులో ఆటగాళ్లను మ్యాచ్‌లలో పాల్గొనకుండా నిలిపివేయదలచుకుంటే ఫ్రాంఛైజీలు ఆయా ఆట గాళ్లకు చెల్లించే మొత్తాన్ని ఈ విడత తగ్గించారు. అలాగే ఆటగాళ్ల కాంట్రాక్టులకు సంబంధించి కూడా గవర్నింగ్‌ కౌన్సిల్‌ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. బీసీసీఐ బోర్డు పర్యవేక్షణలో జరిగే ఈ ఒప్పందాల సందర్భంగా బోర్డు ప్రతినిధులు, ఆటగాళ్లు, యాజమాన్యాలు వాటిపై సంతకాలు చేయాల్సి ఉంటుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.