వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » నేను అలా అనలేదు. నన్ను బ్లాక్ మెయిల్ చేశారు: హమీద్ (Yasir Hameed | Pakistan cricket players | Blackmail | Tafazzul Rizvi | Spot Fixing)
Bookmark and Share Feedback Print
 
PTI
పాకిస్థాన్ క్రికెటర్లు ఏ మ్యాచ్‌నీ వదల్లేదని, ప్రతీ మ్యాచ్‌లోనూ ఫిక్సింగ్ జరిగిందంటూ వ్యాఖ్యలు చేసిన యాసర్ హమీద్ మాట మార్చాడు. తనను బ్లాక్ మెయిల్ చేశారని షాక్ ఇచ్చాడు. స్పాన్సరంటూ వచ్చిన ఓ వ్యక్తి తనను బ్లాక్ మెయిల్ చేస్తూ మెసేజ్ పంపాడని తెలిపాడు. స్నేహితుడంటూ మాటలు కలుపుతూ తన వద్ద ఓ వ్యక్తి నటించాడని, అతడే తనను బ్లాక్ మెయిల్ చేసి ఈ వీడియోను విడుదల చేసినట్లు యాసిర్ హమీద్ ఆరోపించాడు.

"ఓ స్నేహితుడు నాటింగ్‌హామ్‌లోని ఓ రెస్టారెంట్‌లో డిన్నర్‌కు ఆహ్వానించడంతో ఆగస్టు 30వ తేదీ రాత్రి అక్కడికి వెళ్లాను. అక్కడ ఓ వ్యక్తి నాకు పరిచయమయ్యాడు. అతని పేరు అభిజిత్ అన్నాడు. ఓ ఎయిర్‌వేస్ సంస్థతో ఓ వాణిజ్య ఒప్పందానికి ఓకేనా అని అడిగాడు.

ఇంకా యాసర్ హమీద్ మాట్లాడుతూ.. 'అభిజిత్ ఖాన్‌ అనే పేరిట నాకు పరిచయమైన వ్యక్తిని ఎక్కడో చూసినట్లుందని ఆలోచించాను. చివరికి అతను న్యూస్ ఆఫ్ ది వరల్డ్ సంస్థ రిపోర్టర్ మషార్ మసూద్ అని తెలిసింది. ఆ విషయం గుర్తుకు వచ్చినా అతను చెప్పే వాణిజ్య ఒప్పందం గురించి చెవొగ్గి విన్నాను. యూఏఈలో వాణిజ్య ప్రకటనను ఉపయోగించుకుంటామని, 50,000 పౌండ్లు ఇప్పిస్తానని చెప్పాడు.

ఈ వాణిజ్య ప్రకటనకు మరో నలుగురు పాక్ క్రికెటర్లను సిఫార్సు చేయాల్సిందిగా నన్ను అడిగాడు. నేను కూడా ఉమర్ గుల్, షాహిద్ అఫ్రిది, అక్మల్, ఆలమ్ అనే నలుగురి పేర్లను చెప్పాను. అక్కడే ఉన్న ఉమర్‌గుల్ సైతం ఇందుకు అంగీకరించాడు. దీని తర్వాత స్నేహితుడైన అభిజిత్ ఖాన్, తర్వాత స్పాట్ ఫిక్సింగ్‌పై మాట్లాడటం ఆరంభించాడు.

నేను సైతం అతను అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాను. ప్రస్తుతం స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో చిక్కిన ముగ్గురు పాక్ క్రికెటర్లను గురించి అడిగాడు. భట్, అఫ్రిది, ఆసిఫ్‌లపై పత్రికలో చదివిన వివరాలనే అతని వద్ద చెప్పాను. ఆ తర్వాతే తాను మాట్లాడిన విషయాన్ని రికార్డు చేసినట్లు తెలిసింది.

రెండు రోజుల తర్వాత అభిత్ ఖాన్ తనను ఫోన్‌లో సంప్రదించి 25,000 పౌండ్లు ఇస్తానని, సల్మాన్ భట్, ఆసిఫ్, అఫ్రిదిలపై వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇవ్వాలని బెదిరించాడు. వెంటనే నేను ఆ కాల్ కట్ చేశాను దాని తర్వాతే నాకు ఎస్ఎమ్ఎస్ వచ్చింది.

అందులో "వీడియోలో మీరు తాగుతూ కనిపించారు. మీరు మాట్లాడిన విషయమంతా రికార్డు అయ్యింది. దాన్ని నిరాకరించడం సరికాదు. మీరు చెప్పినదంతా నిజమని ఒప్పుకోవడమే మంచిది" అనే మెసేజ్ వచ్చినట్లు హమీద్ చెప్పాడు.

ఇదేవిధంగా హమీద్ పాక్ క్రికటర్లపై చేసిన వ్యాఖ్యలు ఆతనికి తెలియకుండానే చిత్రీకరించినవని పాకిస్థాన్ క్రికెట్ జట్టు న్యాయ సలహాదారు రిజ్వీ అన్నారు. ఇలా మాట్లాడితే హమీద్‌కు ఓ మొత్తం ఇస్తామని ఆఫర్ ఇచ్చారని రిజ్వీ ఆరోపించారు.

అయితే రిజ్వీని బ్రిటన్‌లోని పాకిస్థాన్ రాయబార కేంద్రంలో కలిసిన తర్వాతే యాసర్ హమీద్ ఇలా మాట మార్చాడని వార్తలు వస్తున్నాయి. ఇందులో అనుమానించాల్సింది ఏమిటంటే..? ఆగస్టు 30వతేదీ జరిగిన ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి ఎందుకు తెలియజేయలేదని వారు అభిప్రాయపడుతున్నారు.

ఒకవేళ హమీద్ ఇలాంటి భేటీ ఇచ్చిన తర్వాత యాసర్ హమీద్ ముదాయిస్తున్నాడా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. లేదా న్యూస్ ఆఫ్ ది వరల్డ్ తన ఉనికి కోసం యాసిర్ హమీద్‌ను బెదిరిస్తుందా? అని వారు అనుమానిస్తున్నారు.

ఇదిలావుంటే, తోటి క్రికెటర్లపై హమీద్ చేసిన విమర్శలను 'ది న్యూస్ ఆఫ్ ది వరల్డ్' ఆదివారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. పాక్ క్రికెటర్లు ఏ మ్యాచ్‌నీ వదల్లేదని, వాళ్లు దాదాపు ప్రతీ మ్యాచ్‌ను ఫిక్స్ చేశారు. తాను గెలవాలని ఆడితే.. వారంతా జట్టు ఓటమే లక్ష్యంగా బరిలోకి దిగేవారు. లగ్జరీ లైఫ్ కోసం అడ్డదారులు తొక్కారని ఆ వీడియోలో యాసిర్ హమీద్ వెల్లడించాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.