ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » పాకిస్థాన్ తదుపరి కోచ్‌గా డేవ్ వాట్‌మోర్ నియామకం? (Whatmore | Knight Riders' Coach | Pakistan | Cricket)
పాకిస్థాన్ తదుపరి కోచ్‌గా డేవ్ వాట్‌మోర్ నియామకం?
ఆదివారం, 1 జనవరి 2012( 12:41 IST )
పాకిస్థాన్ క్రికెట్ జట్టు కొత్త కోచ్‌గా డేవ్ వాట్‌మోర్ నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నారు. ఇందులోభాగంగా ఆయన.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీలలో ఒక్కటైన కోల్‌కతా నైట్ రౌడర్స్ జట్టు కోచ్ పదవికి ఆదివారం రాజీనామా చేశారు. దీంతో ఆయన పాక్ క్రికెట్ జట్టు చీఫ్ కోచ్‌గా నియమితులు కావడం ఖాయమన్న సంకేతాలు అందుతున్నాయి.
తమ దేశ జాతీయ క్రికెట్ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు నిర్వహించే అంశంపై చర్చించేందుకు వాట్‌మోర్‌ను పీసీబీ ఈనెల రెండో వారంలో ఆహ్వానించింది. ఈ ఆహ్వానం పట్ల సానుకూలంగా వాట్‌మోర్ స్పందించారు. ఈయన గతంలో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లకు కోచ్‌గా కూడా వ్యవహరించారు.
దీనిపై కోల్‌కతా నైట్ రైడర్స్ చీప్ ఎగ్జిక్యూటివ్ వెంకీ మైసూర్ స్పందిస్తూ.. అంతర్జాతీయ క్రికెట్ జట్టుకు కోచ్‌గా వెళ్లేందుకు వాట్‌మోర్ చూపిస్తున్న ఆసక్తిని తాము స్వాగతిస్తామన్నారు. గత రెండేళ్లుగా తమ జట్టుకు అందించిన సేవలను తాము కొనియాడుతున్నట్టు చెప్పారు.