ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » సిడ్నీ క్రికెట్ మైదానం నా ఫేవరేట్ గ్రౌండ్ : టెండూల్కర్ (Sachin | Sydney Cricket Ground | Test Match | Australia | India)
సిడ్నీ క్రికెట్ మైదానం నా ఫేవరేట్ గ్రౌండ్ : టెండూల్కర్
ఆదివారం, 1 జనవరి 2012( 14:52 IST )
ప్రపంచంలో ఉన్న క్రికెట్ స్టేడియాల్లో తనకు ఫేవరేట్‌గా ఉన్న స్టేడియాల్లో సిడ్నీ క్రికెట్ మైదానం ఒకటని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. సచిన్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు. ఈ మైదానంలో సచిన్ ఇప్పటి వరకు మొత్తం నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా 221 సగటును కలిగివున్నాడు. అలాగే, ఈ స్టేడియంలో రెండు సెంచరీలతో పాటు అత్యధికంగా 241 పరుగులు చేసి అజేయంగా కూడా నిలిచాడు.
ప్రస్తుతం సెంచరీల్లో వందో శతకం కోసం పరితపిస్తున్న సచిన్.. ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుతో ఈనెల మూడో తేదీ నుంచి జరిగే రెండో టెస్టులో బరిలోకి దిగనున్నారు. ఈ మ్యాచ్‌లో సచిన్ సెంచరీ చేస్తాడనని అందరూ భావిస్తున్నారు. ఈ స్టేడియం సచిన్‌కు బాగాకలిసి రావడమే ఇందుకు మంచి ఉదాహరణగా చెపుతున్నారు.
దీనిపై సచిన్ స్పందిస్తూ సిడ్నీ మైదానం నాకు ప్రత్యేకమైంది, అచ్చొచ్చింది కూడా. ఇక్కడి వాతావరణమంటే ఎంతో ఇష్టం. ఆ మైదానంలో అడుగు పెడుతున్నప్పుడు మధురానుభూతి కలుగుతుందని చెప్పుకొచ్చాడు. కాగా, ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న వందో సెంచరీని తనకు అచ్చొచ్చిన వేదికలో పూర్తి చేయగలనన్న విశ్వాసం సచిన్ మాటల్లో అంతర్లీనంగా వ్యక్తమైందని చెప్పొచ్చు.