ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » కెప్టెన్సీ నుంచి తొలగించినా ఫీలవను: మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni | Team India | Captain | Seniors | Australia)
కెప్టెన్సీ నుంచి తొలగించినా ఫీలవను: మహేంద్ర సింగ్ ధోనీ
మంగళవారం, 31 జనవరి 2012( 12:30 IST )
ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఘోర పరాభవాన్ని చవిచూడటంతో వెలువెత్తిన విమర్శలను భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ కొట్టిపారేశాడు. ఆసీస్ గడ్డపై భారత్ చిత్తుగా ఓడిపోవడంతో తనను కెప్టెన్సీ నుంచి తొలగించినా ఫీలవనని ధోనీ స్పష్టం చేశాడు. ఏదో ఒకటి రెండు సిరీస్‌లో భారత్ ఓటమి చవిచూసినందుకే ఆటగాళ్లు, జట్టు సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయడం సరికాదన్నాడు.
టీమిండియా ఆటతీరుపై ఎవరెవరో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధోనీ మండిపడ్డాడు. యువక్రికెటర్లకు జట్టులో ఎప్పటికీ అవకాశం ఉందని, విదేశీ గడ్డపై వరుస ఓటములతో సీనియర్లపై విమర్శలు గుప్పించడం సమంజసం కాదన్నాడు.
సీనియర్ క్రికెటర్లు జట్టుకు చేసిన సేవల్ని గుర్తించుకోవాలని ధోనీ తెలిపాడు. కాగా ఆస్ట్రేలియా సిరీస్ ముగిసిన తర్వాత తొలిసారిగా ధోనీ మీడియాతో మాట్లాడుతూ.. వైట్‌వాష్ విమర్శలను తిప్పికొట్టాడు.