ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » ఆసీస్‌తో తొలి వన్డే: ఇంగ్లండ్ 15 పరుగుల తేడాతో గెలుపు! (Australia | First odi | England | Iyan Morgan | Test Cricket)
ఆసీస్‌తో తొలి వన్డే: ఇంగ్లండ్ 15 పరుగుల తేడాతో గెలుపు!
FILE
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. మిడిలార్డన్ బ్యాట్స్‌మన్ ఇయాన్ మోర్గాన్ (63 బంతుల్లో 89 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాతో సునాయాసంగా గెలుపొందింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 272 పరుగులు చేసింది. మోర్గాన్‌కు తోడుగా... ట్రాట్ (54), కుక్ (40), బెల్ (41) నిలకడగా ఆడారు. బ్రెట్ లీ, మెక్‌కే, డొహెర్టీ, కమిన్స్, వాట్సన్ తలా ఓ వికెట్ పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 257 పరుగులు చేసింది.