ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » కొలంబియా టెస్టు: 551 పరుగుల భారీ స్కోర్ వద్ద పాక్ డిక్లేర్! (Columbia Test | sri Lanka | Pakistan | First Innings | Azhar ali)
కొలంబియా టెస్టు: 551 పరుగుల భారీ స్కోర్ వద్ద పాక్ డిక్లేర్!
మంగళవారం, 3 జులై 2012( 17:14 IST )
FILE
కొలంబియాలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పతనమై 551 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తదనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక ఒక వికెట్ పతనానికి 135 పరుగులు సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టుకు ఓపెనర్లు శుభారంభం చేశారు. హఫీజ్ అద్భుతంగా రాణించి 196 పరుగులు సాధించగా మరో ఓపెనర్ 65 పరుగులు సాధించాడు.
తదనంతరం బరిలోకి దిగిన అజర్ అలీ 157 పరుగులు సాధించాడు. మిస్బా-ఉల్-హక్ 66 పరుగులు చేశాడు. ఫలితంగా రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ ఆరు వికెట్ల పతనానికి 551 పరుగులు సాధించింది.
దీంతో తన తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీలంక జట్టుకు ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ పరనవిత్రా డకౌట్ అయ్యాడు. అయితే 11 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక జట్టును దిల్షాన్-సంగక్కర జోడీ ఆదుకున్నారు. ప్రస్తుతం దిల్షాన్ (70), సంగక్కర (82)లు సెంచరీ దిశగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఫలితంగా 47.2 ఓవర్లకు శ్రీలంక ఒక వికెట్ పతనమై 155 పరుగులు సాధించింది.