ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » శ్రీలంక టూర్‌కు భారత జట్టు ఎంపిక : సెహ్వాగ్‌కు చోటు (Team India | sri Lanka Tour | Sehwag | Zaheer Khan | Jadeja Axed)
శ్రీలంక టూర్‌కు భారత జట్టు ఎంపిక : సెహ్వాగ్‌కు చోటు
బుధవారం, 4 జులై 2012( 15:17 IST )
File
FILE
శ్రీలంకలో పర్యటించే భారత జట్టు జాతీయ సెలక్టర్లు బుధవారం ముంబైలో ప్రకటించారు. ఇందులో ముందుగా ఊహించినట్టుగానే డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, పేసర్ జహీర్ ఖాన్‌కు చోటు కల్పించారు. అయిత్ యువ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై వేటు వేసిన సెలక్టర్లు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు విశ్రాంతినిచ్చారు.
ఈనెలలో ప్రారంభమయ్యే ఈ పర్యటనలో భారత జట్టు ఐదు వన్డే మ్యాచ్‌లు, ఒక ట్వంటీ-20 మ్యాచ్ ఆడుతుంది. సెప్టెంబరులో శ్రీలంక వేదికగా జరిగే ఐసీసీ వరల్డ్ ట్వంటీ-20 సిరీస్‌కు ఇది సన్నాహక టోర్నీగా భావిస్తున్నారు.
ఆస్ట్రేలియాలో జరిగిన వన్డే సిరీస్‌తో పాటు ఆసియా కప్‌లో పేలవమైన ప్రదర్శన కారణంగా రవీంద్ర జడేజాపై వేటు వేశారు. అదేసమయంలో ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన కనపరిచిన అజింకా రహానేకు సెలక్టర్లు చోటు కల్పించారు.
అలాగే 15 మంది సభ్యుల జట్టులో ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చోటు దక్కించుకోలేక పోయాడు. జట్టు ఎంపికపై చీఫ్ సెలక్టర్ కె.శ్రీకాంత్ మాట్లాడుతూ... సమతూకంతో కూడిన జట్టును ఎంపిక చేశామని, ఖచ్చితంగా శ్రీలంక గడ్డపై రాణిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.