ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » భారత్‌తో సిరీస్: కులశేఖర స్థానంలో నువాన్ ప్రదీప్‌కు చోటు (Sri Lanka | Nuwan Pradeep | Zimbabwe | Odis | Team India)
భారత్‌తో సిరీస్: కులశేఖర స్థానంలో నువాన్ ప్రదీప్‌కు చోటు
సోమవారం, 23 జులై 2012( 17:09 IST )
FILE
భారత్‌తో జరిగిన తొలి వన్డేలో నువాన్ కులశేఖర గాయపడటంతో అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ నువాన్ ప్రదీప్‌కు చోటు దక్కింది. ఇంతవరకు మూడు టెస్టులు మాత్రమే ఆడిన నువాన్ ప్రదీప్ అంతర్జాతీయ వన్డేల్లో మాత్రం ఆరంగేట్రం చేయలేదు. సోమవారం నువాన్ ప్రదీప్ జట్టులో కలుస్తాడని శ్రీలంక సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఆషంతా డి మెల్ తెలిపారు.
జింబాబ్వే నుంచి స్వదేశానికి చేరుకోనున్న ప్రదీప్ శ్రీలంక తరపున ముక్కోణపు సిరీస్ బరిలోకి దిగాడు. కాగా అక్టోబర్ 2011లో టెస్టు కెరీర్ ప్రారంభించిన నువాన్ ప్రదీప్.. పాకిస్థాన్‌తో అబుదాబిలో జరిగిన ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. ఈ నేపథ్యంలో భారత్‌తో జరిగిన తొలి వన్డేలో కులశేఖర గాయపడటంతో ఆతని స్థానంలో ప్రదీప్ ఆడుతాడని డి మెల్ వెల్లడించాడు.