ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > ప్రస్తుత సిరీస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సెంచరీకి చేరువలో లక్ష్మణ్
సిడ్నీ టెస్టులో భారత జట్టును ముందుకు నడిపించే బాధ్యతను ద్రావిడ్ - లక్ష్మణ్‌లు భుజాన వేసుకున్నారు. స్టైలిష్ బ్యాట్స్‌మెన్‌గా లక్ష్మణ్ (73) సెంచరీ దిశగా కదులుతున్నాడు. ఓపెనర్ జాఫర్ (3) మరోసారి విఫలమైనాడు. భారత జట్టు టీ విరామ సమయానికి ఒక వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది.

క్రీజ్‌లో లక్ష్మణ్ (73), ద్రవిడ్ (18) లు ఉన్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు అభేధ్యంగా 93 పరుగులు జోడించారు. లక్ష్మణ్ 14 ఫోర్లతో 73 పరుగులు చేయగా, ద్రావిడ్ 3 ఫోర్లతో 18 పరుగులు చేశాడు. అంతకుముందు ఆసీస్ 463 పరుగులకు ఆలౌటైంది. సైమండ్స్ 162 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

బ్రెట్ లీ 10 ఫోర్లతో 59 పరుగులు చేసి కెరీర్‌లో నాలుగో అర్ధ సెంచరీని నమోదుచేశాడు. వీరిద్దరి జోడీ 8వ వికెట్‌కు 114 పరుగులు జోడించింది. భారత బౌలర్లలో కుంబ్లే, ఆర్పీ సింగ్‌లు చెరో నాలుగు వికెట్లు పడగొట్టగా, హర్బజన్ సింగ్ 2 వికెట్లు తీసుకున్నాడు.
మరిన్ని
రెండో టెస్టు: తొలి ఆసీస్ స్కోరు 376/7
రెండో టెస్టు: సెంచరీతో ఆదుకున్న సైమండ్స్
రెండో టెస్టు: ఆస్ట్రేలియాను ఆదుకున్న సైమండ్స్-హాగ్
తొలి టెస్ట్‌ను గెలిచిన ఆస్ట్రేలియా: 1-0 తో ఆధిక్యం
ఏటికి ఎదురీదుతున్న టీమ్ ఇండియా
తొలి టెస్ట్: భారత్ విజయ లక్ష్యం 499 పరుగులు