కొలంబో సిన్హలీస్ స్పోర్ట్స్ క్లబ్ (ఎస్ఎస్‌సీ) వేదికగా జరుగుతున్న భారత-శ్రీలంక తొలి టెస్టు ప్రారంభానికి వర్షం అడ్డంకిగా నిలిచింది. కొలంబో నగరంలో నిరవధికంగా కురుస్తున్న వర్షాలవల్ల ఎస్ఎస్‌సీ గ్రౌండు చిత్తడిగా మారింది. లంచ్ సమయానికి స్టేడియంలో వర్షం కురవటం ఆగిపోవడంతో పిచ్‌పై కవర్లను తొలగించారు. అంపైర్లు ప్రస్తుతం మైదానాన్ని పరిశీలిస్తున్నారు.
శ్రీలంకతో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌లో తమ బ్యాటింగ్ బలాన్ని రుచిచూపించాలని భారత జట్టు ఆరాటపడుతుంది. శ్రీలంక యువ స్పిన్నర్ మెండిస్‌ను ఎలా ఎదుర్కోవాలో తమకు బాగా తెలుసునని భారత టెస్టు జట్టు కెప్టెన్ అనిల్ కుంబ్లే చెప్పారు.
భారత జట్టు టెస్టు విభాగంలో అన్నిరంగాల్లో బలమైనదేనని శ్రీలంక మాజీ కెప్టెన్లు అంచనా వేశారు. వారి జోరును అడ్డుకుంటామని శ్రీలంక కెప్టెన్ మహేళ జయవర్ధనే ధీమా వ్యక్తం చేశాడు. ఈ సిరీస్ ఆసక్తికరంగా సాగుతుందని క్రీడానిపుణులు అంచనా వేశారు.
|