ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > ప్రస్తుత సిరీస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వర్ణపురా అర్ధ సెంచరీ : శ్రీలంక 85/2  Search similar articles
కొలంబో ఎస్ఎస్‌సీ గ్రౌండులో భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్ వర్ణపురా అర్ధ సెంచరీ సాధించాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. క్రీజ్‌లో వర్ణపురా (50), మహేళ జయవర్ధనే (16) లు ఉన్నారు.

శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగగా భారత బౌలర్ ఇషాంత్ ఆదిలోనే దెబ్బతీశాడు. ఓపెనర్ వాండర్ట్ (3) ను ఇషాంత్ బౌలింగ్‌లో కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత వర్ణపురా-సంగక్కరలు రెండో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. వర్ణపురా 6 ఫోర్లతో 50 పరుగులుచేసి జహీర్ ఖాన్ బౌలింగ్‌లో రాహుల్ ద్రవిడ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

భారత్-శ్రీలంకల మధ్య జరుగుతున్న తొలి టెస్టు వేదిక కొలంబోలో హోరున కురుస్తున్న వర్షం కారణంగా మైదానం మొత్తం చిత్తడిగా మారింది. దీనితో వరుసగా రెండు సెషన్లు రద్దయ్యాయి. చివరకు తేనీటి విరామ సమయానికి మైదానం మ్యాచ్ ఆడటానికి అనుకూలంగా మారింది. దీనితో చివరి సెషన్లలో 22 ఓవర్ల మాత్రమే జట్లు ఆడాయి.
మరిన్ని
కొలంబో టెస్టులో శ్రీలంక బ్యాటింగ్
వర్షం వల్ల మ్యాచ్‌కు ఆటంకం
టెస్టు ర్యాంకుల్లో ప్రిన్స్, డివిలియర్స్ ముందంజ
లీడ్స్ టెస్టులో ఓటమి దిశగా ఇంగ్లాండ్
ప్రిన్స్ సెంచరీ : దక్షిణాఫ్రికా 262/4
దక్షిణాఫ్రికా ధాటికి ఇంగ్లాండ్ విలవిల