సొంత గడ్డపై భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక జట్టు ఆరు వికెట్ల నష్టానికి 600 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శ్రీలంక జట్టులో నలుగురు బ్యాట్స్‌మెన్స్ సెంచరీలు చేశారు. అనంతరం బ్యాంటింగ్‌కు చేపట్టిన భారత్.. ఆదిలోనే ఓపెనర్ సెహ్వాగ్ వికెట్‌ను కోల్పోయింది. కేవలం 16 బంతులను ఎదుర్కొన్న సెహ్వాగ్ ఐదు ఫోర్ల సాయంతో 25 పరుగులు చేసి, కులశేఖర బౌలింగ్‌లో వర్ణపుర క్యాచ్ పట్టగా అవుట్ అయ్యాడు.
అనంతరం గంభీర్‌కు, ద్రావిడ్ జతకలిశాడు. అంతకుముందు శ్రీలంక జట్టులో ఓపెనర్ వర్ణపుర (115), కెప్టెన్ జయవర్ధనే (136), సమరవీర (127), దిల్షాన్ (125)లు సెంచరీలతో కదం తొక్కారు. దీంతో శ్రీలంక జట్టు ఆరు వికెట్లను మాత్రమే కోల్పోయి 600 పరుగుల భారీ స్కోరు చేసింది. టెస్ట్ మ్యాచ్‌కు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉంది.
|