ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > ప్రస్తుత సిరీస్ > కొలంబో వన్డే : లంక విజయ లక్ష్యం 257
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కొలంబో వన్డే : లంక విజయ లక్ష్యం 257
FILE
టీం ఇండియా-శ్రీలంక జట్ల మధ్య ప్రేమదాస స్డేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో... భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న టీంఇండియా, లంకకు 257 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.

భారత ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ (42), సచిన్ టెండూల్కర్ (6) పరుగులతో పెవిలియన్ చేరగా... తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ గౌతం గంభీర్ (27), యువరాజ్ (66), సురేష్‌ రైనా (29), యూసుఫ్‌ పటాన్ (21) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (23), కుమార్‌ (15), జహీర్ (17) పరుగులు సాధించి వెనుదిరిగారు. చివరిగా ఓజా మాత్రం పరుగులేమీ చేయకుండా క్రీజ్‌లో మిగిలాడు.

శ్రీలంక బౌలర్లలో కులశేఖర్, మహరూఫ్, అజంతా మెండీస్‌లు తలా రేండేసి వికెట్లు పడగొట్టగా... దిల్షాన్ ఒక వికెట్ సాధించాడు. భారత బ్యాట్స్‌మెన్‌లలో అత్యధికంగా యువరాజ్ సింగ్ 66 పరుగులు, అత్యల్పంగా సచిన్ టెండూల్కర్ 6 పరుగులు చేయగా... అసలు పరుగులేమీ చేయకుండా ఓజా క్రీజ్‌లో మిగిలాడు.

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నన టీం ఇండియా తొలి 20.3 ఓవర్లలోనే మూడు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసి కష్టాల్లో పడిపోయింది. ఫేవరేట్‌గా బరిలో దిగిన మాస్టర్ బ్లాస్టర్ తొలివన్డేలో మాదిరిగానే, రెండో వన్డేలో కూడా ఎల్బీడబ్ల్యూతో వెనుదిరిగి, అభిమానులను తీవ్ర నిరాశలో ముంచెత్తాడు. అయినప్పటికీ, ఆ తరువాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌లు నిలకడగా ఆడి భారత్‌కు గౌరవప్రదమైన స్కోరును సంపాదించి పెట్టారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
సెహ్వాగ్‌ రనౌట్ : భారత్‌ 126/3
రెండో వన్డే : బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
దక్షిణాఫ్రికా విజయం : 4-1తో సిరీస్ కైవసం
కష్టాల్లో ఆసీస్ : బ్యాట్స్‌మెన్ల తడబాటు
పొగ మంచుతో డ్రాగా ముగిసిన మొహాలీ టెస్టు
మొహాలీ టెస్టు: ఇంగ్లండ్ విజయలక్ష్యం 403