వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | ప్రపంచకప్ 2011 | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » ప్రస్తుత సిరీస్ » పాక్ ఆటగాడు గ్రౌండ్‌పై వంగున్నాడంటే ఇండియా గెలిచినట్లేనట..?!! (Pakistan Team | Nasir Jamshed | Team India | Cricket)
Nasir
PTI
భారీ లక్ష్యం.. 329. అంతటి భారీ స్కోరును అధిగమించి విజయాన్ని కైవసం చేసుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ పాకిస్తాన్ ఓపెనర్లలో ఒకరైన నసీర్ జష్మెడ్ సెంచరీ చేసిన అనంతరం వెంటనే వెన్ను వంచి వంగి భూమిని ముద్దాడుతూ ఏదో కాసేపు ప్రార్థనలు చేశాడు. అలా నిమిషం పాటు జరిగింది.

అప్పటివరకూ ఇక ఇండియా పని అయిపోయినట్లే అనుకున్నవారిలో కొందరు మాత్రం భారత్ తప్పక విజయం సాధిస్తుందని బల్లగుద్ది మరీ చెప్పడం మొదలెట్టారు. ఎలా గెలుస్తుందయా బాబూ.. అని నిలదీస్తే.. పాక్ ఆటగాళ్లలో ఎవరైనా ఇలా విజయోత్సాహంతో గ్రౌండులో వంగి భూమిని తాకారంటే ఖచ్చితంగా ఆ పిచ్ వాళ్లను ఓడించి తీరుతుందని సెలవిచ్చారట.

ఎలా చెప్పగలరని అడిగితే... గతంలో యూనిస్ ఖాన్, ఫాస్ట్ బౌలర్ రియాజ్‌లు కూడా ఇలాగే భారత్ పై మంచి స్కోరు చేసినప్పుడు, వికెట్లు తీసినప్పుడు పిచ్‌ను ముద్దాడారనీ, ఆ సమయంలో పాకిస్తాన్ జట్టు పరాజయం పాలైందని కొత్త వాదన తెచ్చారు. అవును.. ఎవరి విశ్వాసం వారిది.. సచిన్ జుట్టు పెంచినందుకే శత శతకం బాదగలిగాడని కొంతమంది అంటున్నారు. అదీ సంగతి.
సంబంధిత సమాచారం
Feedback Print