|
విజయంలో కీలక పాత్ర పోషించిన యువకులు...
|
|
|
|
|
|
బుధవారం, 5 మార్చి 2008( 17:18 IST )
|
|
|
|
|
|
|
|
|
|
|
| | కంగారుల దృష్టిలో హీరో... ఇషాంత్ శర్మ. ఈ పేరు ఆసీస్ పర్యటనకు ముందు ఎవరికీ అంత తెలియదు. అయితే టెస్టు, వన్డే సిరీస్ ముగిసే సమయానికి అతడే హీరో అయ్యాడు. శర్మ బౌలింగ్ అంటే ప్రపంచ ఛాంపియన్లు కంగారుపడేలా చేశాడు. ప్రతి మ్యాచ్ మ్యాచ్‌కు ఎంతో పరిణితి సాధిస్తూ తన బౌలింగ్ లైన్ అండ్ లెన్త్‌ను మెరుగుపరుచుకుని హడలెత్తించాడు. ఆరంభంలో వికెట్లు తీసి, ఆసీస్ మెడలు వంచే బౌలర్‌గా పేరుగడించాడు.
ప్రవీణ్ "ప్రావీణ్యం"... వన్డే సిరీస్ కోసం భారత జట్టుకు ఎంపికైన కొత్త కుర్రాడు. దేశవాళీ పోటీల్లో అమితంగా రాణించినందుకు దక్కిన ప్రతిఫలం. ఆసీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో చెత్త బౌలింగ్. ఆ తర్వాత రెండు మ్యాచ్‌లకు పెవిలియన్‌కే పరిమితం. కానీ చావో రేవో తెలుసుకోవాల్సిన కీలక మ్యాచ్‌లో ప్రవీణ్ కుమార్‌కు చోటు కల్పించారు. అందరూ పెదవి విరిచారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడం ఖాయమని భావించారు. అయితే తన స్వింగ్ ప్రతాపంతో తనను విమర్శించిన వారి అంచనాలను తలకిందులు చేశాడు. ఆ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన ప్రవీణ్ రెండు ఫైనల్స్‌లలో ఆరు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలా ప్రత్యర్థిని ఆరంభంలోనె దెబ్బతీసే బౌలర్‌గా పేరుతెచ్చుకున్నాడు.
"రూటు" మార్చిన ధనాధన్... ధనాధన్ ధోనీగా పేరుగాంచిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈసిరీస్ ఆద్యంతం తన పంథాను పూర్తిగా మార్చుకున్నాడు. క్రీజ్‌లోకి వచ్చే ధోనీ నుంచి కేవలం సిక్సర్లు, ఫోర్లు మాత్రమే ఆశించరాదని ఈ సిరీస్‌తో చాటి చెప్పాడు. ఇన్నింగ్స్‌ను తీర్చిదిద్దేందుకు అవసరమైతే తన ఆటతీరుకు విరుద్ధంగా కొత్త అవతారం ఎత్తగలనని నిరూపించాడు. కీలక సమయాల్లో జట్టు అవసరాలకు అనుగుణంగా అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు.
భారీ స్కోర్లు చేయలేక పోయినా జట్టు గెలుపుకు అవసరమైన పలుగులు చేసే వికెట్ కీపర్‌గా పేరుసాధించాడు. అందువల్లే ఒకే సిరీస్‌లో 300 పైచిలుకు పరుగులు సాధించి, 20 మందిని అవుట్ చేసిన తొలి భారత వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. అలాగే.. మైదానంలో అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని ప్రత్యర్థిని బోల్తా కొట్టించి "టీమ్ ఇండియా"కు సిబీ సిరీస్ కప్‌ను అందించాడు. కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానుల్లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.
|