| మహిళల ట్వంటీ- 20 ప్రపంచకప్‌ను ఇంగ్లాండ్ అమ్మాయిలు చేజిక్కించుకున్నారు. ఆదివారం జరిగిన ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్ జట్టు ఆరు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌లోనూ న్యూజిలాండ్‌పైనే ఇంగ్లాండ్ విజయం సాధించింది. | దక్షిణాఫ్రికాను సెమీస్ దురదృష్టం మరోసారి వెంటాడింది. కీలకమైన మ్యాచ్‌లను ఒత్తిడికిగురై చేజార్చుకునే దక్షిణాఫ్రికా గురువారం పాకిస్థాన్‌తో జరిగిన ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. ఈ పోరులో దక్షిణాఫ్రికాపై పాకిస్థాన్ విజయం సాధించి వరుసగా రెండోసారి ట్వంటీ- 20 ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరింది. |