ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > ట్వంటీ20 ప్రపంచకప్ 2009 > శ్రీలంక చేతిలో న్యూజిలాండ్ పరాజయం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
శ్రీలంక చేతిలో న్యూజిలాండ్ పరాజయం
ట్వంటీ-20 ప్రపంచకప్ పోటీల్లో భాగంగా మంగళవారం శ్రీలంక- న్యూజీలాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో లంకేయులు 48 పరుగుల తేడాతో కివీస్‌ను ఓడించారు. 17 ఓవర్లలో కేవలం 105 పరుగులకే న్యూజీలాండ్‌ను పెవిలియన్ ముఖం పట్టించారు. దీంతో శ్రీలంక ఆ గ్రూపులో అగ్రస్థానాన్ని ఆక్రమించింది.

శ్రీలంక బౌలర్లు అద్భుతంగా రాణించడంతో న్యూజీలాండ్ బ్యాట్సమన్లు పరుగులు తీయడానికి నానా తంటాలు పడ్డారు. శ్రీలంక బౌలర్ అజంతా మెండిస్ మూడు ఓవర్లలో కేవలం 9 పరుగులిచ్చి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి న్యూజీలాండ్ నడ్డి విరిచాడు.

దీంతో న్యూజీలాండ్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండంకెల స్కోరును కేవలం ముగ్గురు బ్యాట్సమన్లు మాత్రమే చేయగలిగారు. మిగిలినవారంతా లంకేయుల బౌలింగ్ ధాటికి తలవంచి పెవిలియన్ ముఖం పట్టారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
మరిన్ని
ఐర్లాండ్‌పై విజయంతో సెమీస్‌లో పాకిస్థాన్
సూపర్ 8: శ్రీలంకపై పోరాడి ఓడిన ఐర్లాండ్
ఇంగ్లాండ్‌పై పరాజయం: భారత్ ఇంటిముఖం
గుల్ ధాటికి.. విలవిలలాడిన న్యూజిలాండ్
దక్షిణాఫ్రికా చేతిలో వెస్టిండీస్ పరాజయం
టీ20 సూపర్-8: పాక్‌పై లంక ఘనవిజయం