ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > ట్వంటీ20 ప్రపంచకప్ 2009 > ఇంగ్లాండ్‌కు మహిళా ట్వంటీ- 20 ప్రపంచకప్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఇంగ్లాండ్‌కు మహిళా ట్వంటీ- 20 ప్రపంచకప్
మహిళల ట్వంటీ- 20 ప్రపంచకప్‌ను ఇంగ్లాండ్ అమ్మాయిలు చేజిక్కించుకున్నారు. ఆదివారం జరిగిన ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్ జట్టు ఆరు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌లోనూ న్యూజిలాండ్‌పైనే ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఇదిలా ఉంటే తాజా టోర్నీలో సెమీస్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో రాణించిన ఇంగ్లాండ్ అమ్మాయిలు, ఫైనల్ మ్యాచ్‌లో బౌలింగ్‌లో సత్తా చాటారు.

ఈ మ్యాచ్‌లో విజయంతో వన్డే ఛాంపియన్‌గా కొనసాగుతున్న ఇంగ్లాండ్ మహిళా జట్టు ట్వంటీ- 20 ఛాంపియన్‌గానూ అవతరించింది. ఇంగ్లాండ్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు న్యూజిలాండ్ బ్యాట్‌విమెన్ చేతులెత్తేశారు. న్యూజిలాండ్ బ్యాట్స్‌విమెన్‌లో శాట్టర్త్‌వైట్‌ చేసిన 19 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం.

అద్భుతంగా బౌలింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ బౌలర్‌ కేథరిన్‌ బ్రంట్‌ (3/6)కు ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ అందుకోగా, సిరీస్ మొత్తం బ్యాటింగ్‌లో రాణించిన క్లేర్‌ టేలర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ లభించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 85 పరుగులు చేసి ఆలౌటైంది. 86 పరుగుల విజయలక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ క్రీడాకారిణిలు 17 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
మరిన్ని
లంక బోల్తా: పాక్‌కు ట్వంటీ- 20 ప్రపంచకప్
సెమీస్‌లో సఫారీ బోల్తా: ఫైనల్స్‌లో పాక్
మహిళా ప్రపంచకప్ పోటీల్లో భారత్ ఓటమి
కివీస్ ఇంటిముఖం: సెమీ ఫైనల్స్‌లో శ్రీలంక
సూపర్‌ ఎయిట్‌లో సంపూర్ణ పరాజయాలు
శ్రీలంక చేతిలో న్యూజిలాండ్ పరాజయం