ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > కథనాలు > స్విమ్మింగ్ సందర్భంగా మృతి చెందిన క్రీడాకారిణి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
స్విమ్మింగ్ సందర్భంగా మృతి చెందిన క్రీడాకారిణి
స్విమ్మింగ్ పోటీల సందర్భంగా జాతీయ క్రీడాకారిణి ఒకరు గుండె పోటుతో మరణించిన సంఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. పోటీ సందర్భంగా మిగిలినవారికంటే ముందుగా లక్ష్యాన్ని పూర్తి చేసే అవకాశాలు మరణించిన ఆ క్రీడాకారిణికే ఉండడం గమనార్హం.

కోల్‌కతాలోని హుగ్లీ నదిలో పది కిలోమీటర్ల లాంగ్ డిస్టెన్స్ ఇన్విటేషనల్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో 30 మంది క్రీడాకారిణిలు పాల్గొనడం జరిగింది. ఈ ముపై మందిలో 23 ఏళ్ల షంపా దాస్ అనే క్రీడాకారిణి కూడా ఒకరు.

పోటీ ప్రారంభమై దాదాపు తొమ్మది కిలోమీటర్ల దూరం విజయవంతంగా పూర్తి చేసి ఫినిషింగ్ లైన్‌కు చేరువవుతున్న సమయంలో షంపా దాస్‌కు గుండె నొప్పి ప్రారంభమైంది. దీంతో ఆమె పోటీ మధ్యలోనే సృహ తప్పింది. ఈ హఠాత్పరిమాణంతో స్పందించిన నిర్వాహకులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.

అయితే గుండె నొప్పి కారణంగా తేరుకోలేకపోయిన షంపా దాస్ ఆస్పత్రిలోనే మృతి చెందింది. ఈ పోటీల ప్రారంభ సమయంలో షంపా దాస్ ఆరోగ్యపరంగా ఫిట్‌గానే ఉన్నట్లు డాక్టర్లు నిర్థారించడం గమనార్హం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఏసియన్ గేమ్స్ స్వర్ణమే లక్ష్యం : హరేంద్ర సింగ్
అకాడమీ విషయంపై పునరాలోచించాలి : సైనా
కోల్‌కతా వేదికగా ఫుట్‌బాల్ టోర్నీ ఐలీగ్ ప్రారంభం
ఫార్ములావన్ వివాదం : హామిల్టన్‌కు చుక్కెదురు
అకాడమీ స్థల వివాదం : గోపీచంద్‌కు ఊరట
నా కృతజ్ఞతా భావాన్ని శంకించొద్దు : బింద్రా