ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > కథనాలు > నేనెప్పుడూ కొకైన్ వాడలేదు: గ్యాస్‌క్వేట్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నేనెప్పుడూ కొకైన్ వాడలేదు: గ్యాస్‌క్వేట్
తన జీవితంలో ఎప్పుడూ కొకైన్ వాడలేదని ఫ్రెంచ్ టెన్నిస్ క్రీడాకారుడు, ప్రపంచ 21నెంబర్ ఆటగాడు గ్యాస్‌క్వేట్ పేర్కొన్నాడు. తనకు తెలిసి నిషేధం విధించిన పదార్ధాలను తానెప్పుడూ తీసుకోలేదని స్పష్టం చేశాడు. రెండు నెలల క్రితం ఓ టోర్నీ సందర్భంగా నిర్వహించిన డోప్ టెస్టుల సందర్భంగా గ్యాస్‌క్వేట్ దోషిగా తేలడంతో అతనిపై నిషేధం విధించారు.

సోనీ ఎరిక్సన్ ఓపెన్ సందర్భంగా ఈ డోప్ టెస్టు నిర్వహించినప్పుడు గ్యాస్‌క్వేట్ కొకైన్ తీసుకున్నట్టుగా తేలింది. దీంతో రంగంలోకి దిగిన అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) గత నెలలో గ్యాస్‌క్వేట్‌పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై గ్యాస్‌క్వేట్ తాజాగా మాట్లాడుతూ తన జీవితంలో ఎప్పుడూ తాను కొకైన్ తీసుకోలేదని అన్నాడు. అదేసమయంలో పరీక్ష సమయంలో తన శాంపిల్స్‌నుంచి లభించిన అవశేషం కూడా చాలా స్వల్పమని గ్యాస్‌క్వేట్ పేర్కొన్నాడు.

పరీక్షల సమయంలో తన శాంపిల్స్‌లో దొరికింది కేవలం 150 నానోగ్రామ్‌లు మాత్రమేనని, ఇది ఒక లైన్‌లో పదోవంతు మాత్రమేనని గ్యాస్‌క్వేట్ అన్నాడు. తాను డోప్‌టెస్టు జరగడానికి ముందు ఓ పార్టీలో పాల్గొన్నానని అక్కడే తనపై కొకైన్ ప్రయోగం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్న గ్యాస్‌క్వేట్ ఈ విషయంలో నిజాలను తేల్చేందుకు సొంతంగా పరిశోధన ప్రారంభించాడు. ఒకవేళ ఈ విషయంలో గ్యాస్‌క్వేట్ తనను తాను నిరూపించుకోకపోతే అతనిపై రెండేళ్లవరకు నిషేధం విధించే అవకాశం ఉంది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
భారత్‌లోని రెజ్లర్లకు సౌకర్యాలు స్వల్పం..!
తిరిగి టెన్నిస్ కోర్టులోకి షరపోవా
ఫెడ్‌కప్‌లో భారత్‌ రాణిస్తుందా...?
అవినీతిలో మునిగిన పాఠశాలల ఆటలు
హాంకాంగ్ బ్యాడ్మింటన్ టోర్నీలో సైనా రాణించేనా
నెంబర్ వన్ కన్నా వింబుల్డన్ ముఖ్యం