టెన్నిస్‌ను కెరీర్‌గా ఎంచుకున్న వారు ఎవరైనా సరే గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకోవాలన్న తపన, ఆకాంక్ష తప్పక ఉండి తీరుతుంది. కనీసం ఒక్కసారైనా ప్రతిష్టాత్మక గ్రాండ్ స్లామ్ టైటిళ్లను అందుకుని తమ క్రీడా జీవితానికి ఒక అర్థం తీసుకురావాలని టెన్నిస్ ఆటగాళ్లు ఆరాటపడుతూ ఉంటారు. టెన్నిస్ ప్రపంచంలో విభిన్న సిరీస్‌లలో క్రీడాకారులు పాల్గొంటుంటారు. ఈ సిరీస్‌లు వేటికవే ప్రత్యేకత సంతరించుకుని ఉంటాయి. అలాంటి వాటిల్లో.. ప్రతిష్టాత్మకమైనవి ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్, యూఎస్ ఓపెన్ లాంటివి ఉన్నాయి. అయితే వీటన్నింటికంటే ప్రత్యేకమైనది.. టెన్నిస్ క్రీడాకారులకు ఒక స్వప్నం లాంటిది వింబుల్డన్.| టెన్నిస్ క్రీడాకారులకు వింబుల్డన్ ఒక స్వప్నం.. |
| | టైటిల్ సాధించకపోయినా.. వింబుల్డన్‌లో ఒక మ్యాచ్‌లోనైనా పాల్గొంటే చాలని క్రీడాకారులు అనుకుంటుంటారంటే అతిశయోక్తి కాదేమో.
ఎందుకంటే.. టెన్నిస్ ప్రపంచంలోనే అత్యంత పురాతన, ప్రతిష్టాత్మకమైన టోర్నీ వింబుల్డన్. 1877లో తొలిసారిగా ఈ టోర్నీ ప్రారంభమైంది. |
| |
టైటిల్ సాధించకపోయినా.. వింబుల్డన్‌లో ఒక మ్యాచ్‌లోనైనా పాల్గొంటే చాలని క్రీడాకారులు అనుకుంటుంటారంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే.. టెన్నిస్ ప్రపంచంలోనే అత్యంత పురాతన, ప్రతిష్టాత్మకమైన టోర్నీ వింబుల్డన్. 1877లో తొలిసారిగా ఈ టోర్నీ ప్రారంభమైంది. లండన్‌లోని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ తరపున ఈ టోర్నీని పచ్చగడ్డి కోర్టు (గ్రాస్ కోర్టు)ల్లో నిర్వహిస్తారు. వింబుల్డన్ కోసం నిర్వహించే పురుషుల వార్మప్ సిరీస్ టోర్నమెంట్ అయిన క్వీన్స్ క్లబ్ ఓపెన్ సిరీస్ జరిగిన రెండు వారాల తర్వాత ఈ వింబుల్డన్ టోర్నీ జరుగుతుంది. 13 రోజుల పాటు జరిగే ఈ టోర్నీ సోమవారం ప్రారంభమై ఆదివారంతో ముగుస్తుంది. పురుషుల, మహిళల కేటగిరీల్లో ఒక్కో విభాగంలో సింగిల్స్ ఈవెంట్‌లో 128 మంది క్రీడాకారులు, డబుల్స్ ఈవెంట్‌లో 64 జోడీలు, మిక్స్ డబుల్స్ ఈవెంట్‌లో 48 జోడీలు పాల్గొంటాయి.వింబుల్డన్ చరిత్ర.. 1877 లో వింబుల్డన్ టోర్నీ టైటిల్‌ను 'ఆల్ ఇంగ్లాండ్ క్రొకెట్ మరియు లాన్ టెన్నిస్ క్లబ్ ఛాంపియన్‌షిప్'గా పేరు మార్చారు. అలాగే నియమ నిబంధనల్లోను కొత్త మార్పులు చేశారు. అదే ఏడాదిలో 'జెంటిల్మన్ సింగిల్స్ టైటిల్'ను నిర్వహించారు. ఈ టైటిల్‌ను తొలిసారిగా 200 మంది వీక్షకుల మధ్య స్పెన్సర్ గోర్ కైవసం చేసుకున్నాడు. (తరువాయి పేజీకి క్రింద క్లిక్ చేయండి). |