ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > కథనాలు > అత్యంత పురాతనమైన టోర్నీ.. వింబుల్డన్!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అత్యంత పురాతనమైన టోర్నీ.. వింబుల్డన్!
FileFILE
1882లో 'ఆల్ ఇంగ్లాండ్ క్రొకెట్ మరియు లాన్ టెన్నిస్ టోర్నీ టైటిల్‌'లో క్రొకెట్‌ను తొలగించారు. అయితే.. సెంటిమెంట్ కారణంగా 1889లో తిరిగి దానికి 'ది ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ మరియు క్రొకెట్ క్లబ్‌'గా టైటిల్‌ను నిర్ణయించారు. 1884లో ఆల్ ఇండియా క్లబ్ మహిళల సింగిల్స్ మరియు జెంటిల్మేన్ డబుల్స్ విభాగాలను కూడా అదనంగా జోడించారు.

అలాగే 1913లో మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాలను జత చేశారు. ఇదిలా ఉంటే.. 1968ను టెన్నిస్‌‌లో మరో కొత్త ప్రారంభంగా చెప్పవచ్చు. టాప్ ర్యాంక్ క్రీడాకారులతో పూర్తి స్థాయిలో 1968లో వింబుల్డన్ టోర్నీని నిర్వహించారు. అప్పటి నుండి వింబుల్డన్ బ్రిటన్‌ వాసులకు ఎంతో గర్వకారణంగా నిలిచింది.

1922లో వింబుల్డన్ పోటీలను చర్చి రోడ్డులో ఇంగ్లండ్ టెన్నిస్ క్లబ్ తరపున టోర్నీ నిర్వహించారు. ఇందుకుగాను బ్రిటన్‌లో 1980లో నాలుగు కొత్త కోర్టులను కూడా నిర్మించారు. 1997లో న్యూ నెంబర్ వన్ కోర్టును ప్రారంభించారు. ఇందులో తమాషా ఏంటంటే.. 1936లో పురుషుల విభాగంలో ఫ్రెడ్ పెర్రీ, 1977లో మహిళల విభాగంలో వర్జీనియా వర్జీనియా వాడేల తర్వాత ఒక్క వింబుల్డన్ సింగిల్స్ టైటిల్‌ను కూడా బ్రిటన్ దక్కించుకోలేకపోయింది. 1984 మరియు 2008లలో బాలుర ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను బ్రిటన్‌కు చెందిన అనాబెల్ క్రాఫ్ట్ మరియు లారా రాబ్సన్‌లు గెలుపొందారు.

ఇప్పటి వరకు పురుషుల సింగిల్స్ ఛాంపియన్‌షిప్‌లలో 2001లో మాత్రమే ఒకే ఒక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ గొరాన్ ఇవానిసెవిక్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. కానీ ఒక్క క్వాలిఫైయర్ కూడా ఈ టైటిల్‌ను ఇప్పటి వరకు సాధించలేదు. మహిళల డబుల్స్ మరియు మిక్సడ్ డబుల్స్‌లు మినహాయిస్తే.. 1922 వరకు గత ఏడాది పోటీల్లో విజేతలకు నేరుగా ఫైనల్ రౌండుకు 'బై'ను అనుమతించేవారు. అయితే ఆ తర్వాత ఆ విధానానికి స్వస్తి పలికారు.

2007లో 23వ సీడ్‌గా బరిలోకి దిగి వింబుల్డన్ టైటిల్ కైవసం చేసుకున్న అతి తక్కువ సీడ్ మహిళా క్రీడాకారిణిగా అమెరికాకు చెందిన వీనస్ విలియమ్స్ రికార్డ్ సృష్టించింది. మళ్లీ 2005లో 14వ సీడ్‌గా తాను నెలకొల్పిన రికార్డ్‌ను తానే బ్రేక్ చేసింది విలియమ్స్.
<< 1 | 2 
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఫెదరర్ మళ్లీ ప్రపంచ నెంబర్‌వన్ అయ్యేనా ?
నేనెప్పుడూ కొకైన్ వాడలేదు: గ్యాస్‌క్వేట్
భారత్‌లోని రెజ్లర్లకు సౌకర్యాలు స్వల్పం..!
తిరిగి టెన్నిస్ కోర్టులోకి షరపోవా
ఫెడ్‌కప్‌లో భారత్‌ రాణిస్తుందా...?
అవినీతిలో మునిగిన పాఠశాలల ఆటలు