ప్రధాన పేజి   క్రీడలు  ఇతర క్రీడలు  ఆసక్తికర అంశాలు
 
పేస్‌తో జత కట్టేందుకు రెడీః భూపతి
WD Employee
బీజింగ్ ఒలింపిక్స్‌లో దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని లియాండర్ పేస్‌తో జట్టు కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు మహేశ్ భూపతి పరోక్షంగా ప్రకటించాడు. ఒలింపిక్స్‌లో పతకం కోసం తామిద్దరం జట్టు కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ తమ ఇద్దరి భాగస్వామ్యంతో మాత్రమే భారత జట్టు పతకం గెలవగలదని తాను భావిస్తున్నానన్నాడు.

పేస్‌తో జట్టు కట్టగలవా అనే ప్రశ్నకు తాను వంద పర్యాయాలు ఈ తరహా ప్రశ్నలను అడగాలని కోరుకుంటున్నానన్నాడు. ఒలింపిక్స్‌కు మరో మరో పదిహేను నెలల సమయం ఉన్నందున ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించాల్సి ఉందన్నాడు.