ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > ఆసక్తికర అంశాలు > అగ్ని ప్రమాదానికి ముగ్గురు జిమ్నాస్టులు బలి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అగ్ని ప్రమాదానికి ముగ్గురు జిమ్నాస్టులు బలి
స్విట్జర్లాండ్‌లో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో ముగ్గురు జిమ్మాస్టులు మృతి చెందినట్టు అంతర్జాతీయ జిమ్నస్టిక్స్ సమాఖ్య తెలిపింది. గత నెల 30న ఈ జరిగిన ఈ దుర్ఘటన వివరాలను జిమ్నాస్టిక్స్ సమాఖ్య శుక్రవారం తెలియజేయడం విశేషం.

ఈ విషయమై అంతర్జాతీయా జిమ్నాస్టిక్స్ సమాఖ్య అధికారులు మాట్లాడుతూ స్విట్జర్లాండ్‌లోని ఓ హోటల్‌పై పిడుగుపడడం వల్ల ఆ హోటల్‌కు నిప్పంటుకుందని ఈ సమయంలో ఆ హోటల్లోనే బస చేస్తోన్న అనస్తాసియా, అనా మరీనా, ఓల్లా తదితరలు ఆ మంటల్లో చిక్కుకుని మరణించినట్టు తెలిపారు.

మంటల సమయంలో పై కప్పు కూలడం వల్ల మృతులు తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందని వారు తెలిపారు. మరణించిన వారికి అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ సమాఖ్య ప్రగాఢ సానుభూతి తెలిపింది.
మరిన్ని
ఇండియన్‌వెల్స్ టోర్నీకి విలియమ్స్ సిస్టర్స్ నో
గుర్రపు పందేలు: స్టీకర్ల వింత చేష్టలు  
సముద్ర సాహస క్రీడ సర్ఫింగ్  
ఆ ముగ్గురికీ అవకాశాలు ఉన్నాయ్..!
మలేషియాపై భారత్ గెలుపు
పేస్‌తో జత కట్టేందుకు రెడీః భూపతి