ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > ఆసక్తికర అంశాలు > నేను తండ్రిని కాబోతున్నాను: ఫెదరర్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నేను తండ్రిని కాబోతున్నాను: ఫెదరర్
FILE
మాజీ ప్రపంచ నెంబర్ వన్, టెన్నిస్ దిగ్గజం.. స్విట్జర్లాండ్ టాప్ సీడ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా తన వెబ్‌సైట్‌లో వెల్లడించాడు. తన ప్రియురాలు మిర్కా వావ్‌రింక్ ప్రస్తుతం గర్భంతో ఉందని, వేసవిలో మిర్కా పండంటి బిడ్డకు జన్మినిచ్చే అవకాశం ఉందని ఫెదదర్ వెబ్‌సైట్‌లో వెల్లడించాడు.

" మా కల నిజమవుతోందని.. పిల్లలంటే మాకు చాలా ఇష్టమని ఫెదరర్ చెప్పుకొచ్చాడు. మిర్కా కూడా చాలా సంతోషంగా ఉందని రోజర్ ఫెదరర్ అన్నాడు. మేమిద్దరం ఎప్పుడెప్పుడు తల్లిదండ్రులు అవుతామా అని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామని ఫెదరర్ హర్షం వ్యక్తం చేశాడు.

ఇదిలా ఉండగా.. 2000 సంవత్సరంలో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్‌లో ఫెదరర్ మిర్కాను కలిశాడు. ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి సహజీవనం చేస్తున్నారు. డేవిస్ కప్, దుబాయ్ ఓపెన్‌లను గాయాల కారణంగా చేజార్చుకున్న ఫెదరర్, ప్రస్తుతం ఇండియన్ వెల్స్ టోర్నీలో ఆడుతున్నాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
గ్రాండ్‌శ్లామ్ వేదికకోసం మెల్‌బోర్న్, సిడ్నీల పోటీ
హాకీ టోర్నీ : దాయాదుల పోరుకు రంగం సిద్ధం
ప్రమీలవల్లిపై జీవితకాల నిషేధం విధించిన సమాఖ్య
భవిష్యత్ క్రీడాకారుల కోసం ప్రణాళిక : బింద్రా
నా ముందు చాలా లక్ష్యాలున్నాయి : ఫెదరర్
యాష్ స్టేడియానికి పై కప్పు నిర్మాణం