ప్యారీస్‌లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరుగునుంది. ప్రపంచంలోని ఇద్దరు అగ్రశ్రేణి ఆటగాళ్ల మధ్య జరుగుతున్న ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారనే విషయాన్ని క్రిడాపండితులు సైతం అంచనాలు వేయలేక పోతున్నారు. ఎందుకంటే.. క్లే కోర్టుల్లో వరుసగా 31 విజయాలు సొంతం చేసుకున్న ఘటికుడు రఫెల్ నాదల్ కాగా, రెండు సార్లు ఫ్రెంచ్ టైటిల్‌ను గెలుచుకుని, హ్యాట్రిక్ కోసం ఉరకలేస్తున్న రోజర్ ఫెదరర్ మరో ఆటగాడు.
చివరిసారిగా ఈ ఇద్దరి మధ్య హాంబర్గ్‌లో జరిగిన పోరులో రోజర్ ఫెదరర్ చేతిలో నాదల్ పరాజయం చవిచూశాడు. అంతేకాకుండా ఫెదరర్ గెలిస్తే మాత్రం ఫ్రెంచ్ ఓపెన్‌లో హ్యాట్రిక్ సాధించిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. అంతేకాకుండా డాన్ బడ్జ్ (1938), రాడ్‌లెవర్ (1962), 1969) తర్వాత వరుసగా నాలుగు గ్రాండ్‌శ్లామ్ టైటిల్స్‌ను గెలిచిన మూడో క్రీడాకారుడిగా చరిత్ర సృష్టిస్తాడు. అలాగే ఇది ఫెదరర్ ఖాతాలో 11 గ్రాండ్‌శ్లామ్ టైటిల్‌గా నిలుస్తుంది.
|