ఛండిఘడ్‌లో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడాలన్న భారత్ ప్రతిపాదననూ పాకిస్తాన్ హాకీ బోర్డు తిరస్కరించింది. భారత హాకీ సమాఖ్య వచ్చే నెల 11వ తేదీన ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్‌ను ఛండిఘడ్‌లో నిర్వహించేందుకు ప్రతిపాదించింది. ఈ మేరకు సమాచారాన్ని పాకిస్తాన్ హాకీ సమాఖ్యకు తెలిపింది. అయితే దీనిలో తాము పాల్గొనబోమని పాకిస్తాన్ హాకీ సమాఖ్యం అధ్యక్షుడు జఫ్రుల్లాఖాన్ స్పష్టం చేశాడు.
ఆ రోజు పాకిస్తాన్ ఆవిర్భావకుడు మహమ్మద్ ఆలీ జిన్నా జయంతి కావడం వల్ల ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆడలేమని పాక్ హాకీ సమాఖ్య స్పష్టం చేసింది. దీనికి బదులుగా వచ్చే నవంబరు నెలలో ఇరు దేశాలకు అమోదయోగ్యమైన తేదీల్లో మ్యాచ్‌ను ఆడేందుకు పాక్ సిద్ధంగా ఉన్నట్టు జఫ్రుల్లాఖాన్ వెల్లడించారు.
|